Bhola Shankar : యాక్షన్ షెడ్యూల్ మొదలుపెట్టిన భోళాశంకర్..
చిరంజీవి (Chiranjeevi) మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ (Bhola Shankar) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యాక్షన్ షెడ్యూల్ నేడు మొదలు అయ్యింది.

Chiranjeevi Bhola Shankar action schedule starts
Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ ఏడాదిని బ్లాక్ బస్టర్ హిట్టుతో స్టార్ట్ చేశాడు. వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమాతో వింటేజ్ చిరుని పరిచయం చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రవితేజ, చిరంజీవికి తమ్ముడిగా నటించాడు. దాదాపు 230 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి చిరు స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ కి మరోసారి తెలియజేసింది. ఇక ప్రస్తుతం భోళాశంకర్ (Bhola Shankar) సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
Chiranjeevi: మరో సినిమాకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?
తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ డైరెక్షన్ లో స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు. కాగా ఈ సినిమా తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వేదాళం’ మూవీకి రీమేక్ గా వస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Pawan Kalyan OG : అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సుజిత్.. OG Is Coming!
తమన్నా (Tamannaah) హీరోయిన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh). చిరుకి చెల్లిగా నటిస్తుంది. అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. మురళి శర్మ, రఘుబాబు, వెన్నల కిషోర్, శ్రీముఖి, సత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యాంకర్ రష్మీ చిరుతో కలిసి ఐటమ్ సాంగ్ లో చిందేస్తుంది. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీలో చిరంజీవి ‘చూడాలని ఉంది’ సినిమాలోని యమహా నగరి సాంగ్ ని రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు.
A Stylish Action Sequence is being shot currently under the choreography of the Ram – Lakshman Masters💥💥#BholaaShankar WorldWide In Theatres on AUG 11th 2023🔥
Mega🌟@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanth @AKentsOfficial pic.twitter.com/ci0vlMuxLq
— BholāShankar (@BholaaShankar) March 26, 2023