Bhola Shankar: ఉగాది మెగా ట్రీట్.. భోళాశంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా ‘వాల్తేరు వీరయ్య’ అనే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపే విధంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కాగా, ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ మూవీ ‘భోళాశంకర్’ను రెట్టింపు ఉత్సాహంతో చేస్తున్నాడు.

Bhola Shankar: ఉగాది మెగా ట్రీట్.. భోళాశంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Chiranjeevi Bhola Shankar Locks Release Date

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా ‘వాల్తేరు వీరయ్య’ అనే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపే విధంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కాగా, ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ మూవీ ‘భోళాశంకర్’ను రెట్టింపు ఉత్సాహంతో చేస్తున్నాడు.

Bhola Shankar: చిరు మూవీలో ఛాన్స్ కొట్టేసిన సుశాంత్.. ఆ పాత్రలో కనిపిస్తాడా?

ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంతో చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాలం’కు ఇది తెలుగు రీమేక్‌గా రానుంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని, భోళాశంకర్ టీమ్ ప్రేక్షకులు ఒకరోజు ముందుగానే అదిరిపోయే ట్రీట్ అందించింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా అనౌన్స్ చేసింది భోళాశంకర్ టీమ్.

Bhola Shankar : భారీ కలకత్తా సెట్‌లో మొదలుపెట్టేసిన భోళాశంకర్.. వాల్తేరు వీరయ్య రిటర్న్ టు సెట్స్..

ఆగస్టు 11న భోళాశంకర్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా చిత్ర యూనిట్ తాజాగా ఓ సరికొత్త పోస్టర్‌తో అనౌన్స్ చేసింది. ఈ పోస్టర్‌లో చిరంజీవి, కీర్తి సురేష్‌లతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కనిపిస్తుంది. ఈ అనౌన్స్‌మెంట్‌తో మెగా ఫ్యాన్స్‌తో పాటు, ప్రేక్షకుల్లోనూ భోళాశంకర్ మూవీపై అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.