Chiranjeevi: భోళా శంకర్ మళ్ళీ వెనక్కి.. మెహర్ అసలు మ్యాటరేంటి?

తమిళ్ బ్లాక్ బస్టర్ ‘వేదాళం' రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళ వెర్షన్ లో అజిత్ హీరోగా నటించగా ఆయన నటనకు తమిళ ప్రేక్షకులు ఫిదా..

10TV Telugu News

Chiranjeevi: తమిళ్ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళ వెర్షన్ లో అజిత్ హీరోగా నటించగా ఆయన నటనకు తమిళ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తమిళనాట బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను భోళా శంకర్ గా ఇక్కడ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు విడుదల చేయగా.. ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్‌ నటించబోతున్నట్లు కూడా రాఖీ సందర్భంగా పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు.

Jr NTR: తారక్ కోసం బాలీవుడ్ దర్శకుడి చర్చలు.. సెట్టవుతుందా?

నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలు కావాల్సి ఉండగా ఇప్పటికీ వాయిదాలు పడుతూనే ఉంది. ఆచార్య తర్వాత వేదాళం రీమేక్ మొదలు పెట్టాలనుకున్న చిరు ఏమైందో ఏమో మలయాళం లూసిఫర్ రీమేక్ ను మొదలు పెట్టాడు. గాడ్ ఫాదర్ టైటిల్ తో మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా ఇప్పటికే ముమ్మర షూటింగ్ జరుగుతున్నట్లు మెగా కాంపౌండ్ నుండి వినిపిస్తుంది. ఈ సినిమాతో పాటే మెహర్ రమేష్ భోళాశంకర్ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాలనుకున్నారు.

Shahid Kapoor: ప్యాంట్ మర్చిపోయావా.. హీరో భార్య డ్రెస్సింగ్‌పై ట్రోలింగ్!

కానీ, ఇప్పుడు భోళాశంకర్ మరోసారి వాయిదా పడినట్టు వినిపిస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత చిరు దర్శకుడు బాబీతో ఓ సినిమా చేసేందుకు ఒకే చెప్పాడు. కానీ, ఇప్పుడు ఆ సినిమాను భోళా శంకర్ కన్నా ముందే మొదలు పెట్టనున్నాడని ప్రచారం జరుగుతుంది. అందుకే బాబీ హడావుడిగా నటీనటుల ఎంపికతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడట. దీంతో అసలు వేదాళం రీమేక్ అనువాదం.. కథపై మెగాస్టార్ ఇప్పటికీ కాన్ఫిడెంట్ గా లేడా అనుమానాలు వినిపిస్తున్నాయి.