Bholaa Shankar: మెగాస్టార్ ‘భోళాశంకర్’ నుండి లేటెస్ట్ అప్డేట్.. డబ్బింగ్ స్టార్ట్ చేసిన యూనిట్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను స్టార్ట్ చేశారు.

Bholaa Shankar: మెగాస్టార్ ‘భోళాశంకర్’ నుండి లేటెస్ట్ అప్డేట్.. డబ్బింగ్ స్టార్ట్ చేసిన యూనిట్!

Chiranjeevi Bholaa Shankar Team Starts Dubbing Works

Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Bholaa Shankar: భోళాశంకర్ కోసం రెండు డేట్స్.. ఏది ఫిక్స్ చేస్తారో..?

కాగా, ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను చిత్ర యూనిట్ తాజాగా ప్రారంభించింది. ఈ మేరకు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేసింది. ఇక ఈ సినిమాను తమిళ హిట్ మూవీ ‘వేదాలం’కు రీమేక్‌గా తెరకెక్కిస్తుండటంతో భోళాశంకర్ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో చిరంజీవి పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఓ ఫీస్ట్‌లా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తోంది.

Bholaa Shankar: ఆ హీరో కోసం చిరు త్యాగం.. భోళాశంకర్ వాయిదా అందుకేనా..?

ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో రఘుబాబు, మురళి శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, శ్రీముఖి, రష్మీ గౌతమ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.