Chiranjeevi : నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నా అమ్మ.. చిరంజీవి తల్లి పుట్టినరోజుపై ఎమోషనల్ ట్వీట్

చిరంజీవి తన ట్విట్టర్ లో భార్య సురేఖతో పాటు తల్లి తో ఉన్న ఫోటోని షేర్ చేసి.. అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు.. క్వారెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా.......

Chiranjeevi : నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నా అమ్మ.. చిరంజీవి తల్లి పుట్టినరోజుపై ఎమోషనల్ ట్వీట్

Chiranjeevi

Chiranjeevi :   మెగాస్టార్ చిరంజీవి ప్రతి సంవత్సరం తన తల్లి పుట్టిన రోజులు ఘనంగా జరుపుతారు. తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబులతో పాటు చెల్లిళ్లతో కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటారు. చిరంజీవి తల్లి పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తారు. అయితే ఈ సారి చిరంజీవికి కరోనా సోకడంతో తన తల్లి పుట్టినరోజును సెలబ్రేట్ చెయ్యట్లేదు. దీంతో బాధపడిన చిరంజీవి ఎమోషనల్ గా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Shyam Singharoy : నాని సరికొత్త రికార్డు.. నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ టాప్ 3లో ‘శ్యామ్ సింగరాయ్’

చిరంజీవి తన ట్విట్టర్ లో భార్య సురేఖతో పాటు తల్లి తో ఉన్న ఫోటోని షేర్ చేసి.. అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు.. క్వారెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ.. అభినందనలతో…. శంకరబాబు” అని పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా ఇంస్టాగ్రామ్ లో తన తల్లితో ఉన్న వీడియోని షేర్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.