Rangasthalam : ఆ సినిమాకి చరణ్ కి అవార్డు రాలేదని చిరంజీవి ఫీల్ అయ్యారా??

చిరంజీవి రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్ ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. రామ్ చరణ్, తారక్ కలిసి నటించిన RRR సినిమా ఆస్కార్ దాకా వెళ్లినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకే ఆస్కార్ వచ్చినంత ఆనందంగా ఉంది. చరణ్ కి ఇదే నిర్మాతలు రంగస్థలం అనే సినిమా.....................

Rangasthalam : ఆ సినిమాకి చరణ్ కి అవార్డు రాలేదని చిరంజీవి ఫీల్ అయ్యారా??

Chiranjeevi comments on awards to ram charan for Rangasthalam Movie

Rangasthalam :  మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా రవితేజ ముఖ్య పాత్రలో బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి రిలీజయింది. ఈ సినిమా భారీ విజయం సాధించి దాదాపు ఇప్పటికే 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటికే సినిమా హిట్ అయినందుకు సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్రయూనిట్. తాజాగా వాల్తేరు వీరయ్య భారీ విజయం సాధించినందుకు వరంగల్ లో వీరయ్య విజయ విహారం పేరిట భారీ సభని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు రామ్ చరణ్ కూడా విచ్చేశాడు.

ఇక ఈ ఈవెంట్ లో చిరంజీవి సినిమా గురించి, సినిమాకి వర్క్ చేసిన వాళ్ళ గురించి, సినిమా సక్సెస్ గురించి చాలా సేపు మాట్లాడారు. అలాగే రామ్ చరణ్ రావడంతో రామ్ చరణ్ గురించి కూడా మాట్లాడారు. రామ్ చరణ్ నటించిన RRR సినిమా, రంగస్థలం గురించి ప్రస్తావించారు. రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో చేసిన చిట్టిబాబు పాత్ర ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఆ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే భారీ విజయం సాధించింది. రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు పాత్రకి బెస్ట్ యాక్టర్ గా సైమా అవార్డు, ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నాడు రామ్ చరణ్.

Chiranjeevi : మరోసారి యంగ్ డైరెక్టర్స్ కి చిరంజీవి సలహాలు..

చిరంజీవి రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్ ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. రామ్ చరణ్, తారక్ కలిసి నటించిన RRR సినిమా ఆస్కార్ దాకా వెళ్లినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకే ఆస్కార్ వచ్చినంత ఆనందంగా ఉంది. చరణ్ కి ఇదే నిర్మాతలు రంగస్థలం అనే సినిమా ఇచ్చారు. అందులో చిట్టిబాబు పాత్ర చాలా గొప్పగా చేసాడు చరణ్. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. చిట్టిబాబు పాత్రలో చరణ్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. చరణ్ కి ఆ సినిమాకి జాతీయ అవార్డులు రాకపోవచ్చు కానీ ప్రేక్షకుల గుండెల్లో మరింత ప్రేమని సంపాదించాడు. అవార్డుల కంటే మీ ప్రేమే ఎక్కువ. అవార్డులు వచ్చినా రాకపోయినా మీ అభిమానమే మాకు సంతృప్తినిస్తుంది అని అన్నారు. దీంతో చరణ్ కి రంగస్థలం సినిమాకి నేషనల్ అవార్డు రాలేదని చిరంజీవి ఫీల్ అవుతున్నారా అని అనుకుంటున్నారు. చరణ్ కి అవార్డుల రూపంలో రావాల్సినవి రావట్లేదా అని చిరు భావిస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ RRR సినిమా విషయంలో మాత్రం చరణ్ వల్ల చిరంజీవి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు.