Waltair Veerayya: ఈ సినిమా రొటీన్ ఎంటర్‌టైనర్.. హెడ్డింగ్ రాసిపెట్టుకోమంటున్న వీరయ్య!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది.

Chiranjeevi Comments On Waltair Veerayya Movie
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది.
Waltair Veerayya: వీరయ్య టైటిల్ సాంగ్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ!
ఈ సినిమా రొటీన్ ఎంటర్‌టైనరా లేక కొత్తదనం ఏదైనా ఉందా అని మీడియా వారు మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నించగా.. ఆయన దీనిపై సాలిడ్‌గా స్పందించారు. ‘‘ఈ సినిమా రొటీన్ ఎంటర్‌టైనర్.. హెడ్డింగ్ రాసిపెట్టుకోండి.. కానీ.. లోపలికి వెళ్లిన తరువాత షాక్ తినే ఎమోషన్ కూడి ఉంటుంది.. మనం ఎప్పుడూ ఇంట్లో మన అమ్మమ్మలు, అమ్మ దగ్గరనుంచి రోజూ అదే భోజనం చేస్తాం.. రోజూ అదే భోజనం కావడంతో, అది రొటీన్ భోజనం అని మనం అనుకోం.. కానీ ఆరోజున స్పెషల్ ఐటెమ్స్ ఏముంటాయని.. ఆ భోజనాన్ని ఎంత రుచిగా ఎంజాయ్ చేశామనే దానిపై ఉంటుంది..’’ అంటూ చిరంజీవి కామెంట్ చేశారు.
Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ రాజా ఎంతసేపు కనిపిస్తాడో తెలుసా..?
ఈ సినిమా చేస్తున్నంతసేపు తాను ఎంజాయ్ చేస్తూనే ఉన్నానని.. తన అభిమాని బాబీ, తన హీరోను ఎలా చూపించాలని కోరుకున్నాడో ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుందని మెగాస్టార్ అన్నారు. ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్రకు అందరూ పర్ఫెక్ట్‌గా సరిపోయారని చిరు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్, బాస్ పార్టీ సాంగ్‌లో ఊర్వశి రౌటేలా తమ అందంతో ఆయస్కాంతంలా లాగేస్తారని చిరు చెప్పుకొచ్చారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.