Chiranjeevi : ప్రధాని మోదీ తల్లి మరణం.. చిరంజీవి సంతాపం..

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లి 'హీరాబెన్' నేడు తుదిశ్వాస విడిచారు. అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను రెండు రోజులు క్రిందట ఆస్పత్రిలో చేర్పించారు. ఇవాళ తెల్లవారుజామున చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో చిరంజీవి..

Chiranjeevi : ప్రధాని మోదీ తల్లి మరణం.. చిరంజీవి సంతాపం..

Chiranjeevi : భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లి ‘హీరాబెన్’ నేడు తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను రెండు రోజులు క్రిందట ఆస్పత్రిలో చేర్పించారు. ఇవాళ తెల్లవారుజామున చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి సంతాపం తెలియజేస్తున్నారు.

Chiranjeevi : దేవుడు నేను కోరుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు.. మళ్ళీ ఈ పెద్దరికరం వద్దు.. చిరంజీవి!

ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో చిరంజీవి కూడా తన ప్రగాఢ సంతాపాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశాడు. “మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారి మాతృమూర్తి శ్రీమతి హీరాబా మోదీజీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపారు. స్వర్గలోకానికి బయలుదేరిన ఆ దివ్య ఆత్మకు నా నివాళులు. శ్రీ నరేంద్ర మోదీ గారికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి” అంటూ ట్వీట్ చేశాడు.

కాగా ‘హీరాబెన్’ అంత్యక్రియలు కూడా ముగిసాయి. ప్రధాని నరేంద్ర మోదీ అంత్యక్రియల్లో తన భాద్యతలను నిర్వహించడమే కాకుండా ఆమె పాడెను కూడా మోశారు. ఈ ప్రక్రియలో మోడీ చాలా భావోద్వేగంగా కనిపించారు.