Chiranjeevi: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మెగాస్టార్ శుభాకాంక్షలు!

తాజాగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా బెర్త్ దక్కలేదు కానీ ఉన్న ఒక సహాయ మంత్రిని స్వతంత్ర మంత్రిగా ప్రమోషన్ అయితే దక్కింది. అంతకు ముందు హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి క్యాబినెట్ హోదా కల్పించారు. మోడీ క్యాబినెట్లో కిషన్‌రెడ్డికి పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలు దక్కాయి.

Chiranjeevi: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మెగాస్టార్ శుభాకాంక్షలు!

Chiranjeevi

Chiranjeevi: తాజాగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా బెర్త్ దక్కలేదు కానీ ఉన్న ఒక సహాయ మంత్రిని స్వతంత్ర మంత్రిగా ప్రమోషన్ అయితే దక్కింది. అంతకు ముందు హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి క్యాబినెట్ హోదా కల్పించారు. మోడీ క్యాబినెట్లో కిషన్‌రెడ్డికి పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలు దక్కాయి.

ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి ట్విటర్‌ వేదికగా కిషన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశం యొక్క యోగ్యతలను, ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేయడానికి కిషన్‌ రెడ్డికి మంచి అవకాశం లభించిందన్న మెగాస్టార్ ఆ అనుభూతిని, అధికారాన్ని అనుభవించినందుకు థ్రిల్లింగ్‌గా ఉందని ట్వీట్‌ చేశారు.

గ‌త కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చిరంజీవి కూడా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు అదే శాఖకు మరో తెలుగు వ్యక్తి మంత్రిగా బాధ్యతలు దక్కడంలో చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేంద్ర క్యాబినెట్ మంత్రి అయిన తొలివ్యక్తి కూడా కిషన్ రెడ్డే కావడం మరో విశేషం.