Chiranjeevi : అల్లు అర్జున్ 20 ఇయర్స్ జర్నీ.. చిరు ఎమోషనల్ పోస్ట్!

అల్లు అర్జున్ (Allu Arjun) 20 ఇయర్స్ జర్నీని పూర్తి చేసుకోవడంతో చిరంజీవి (Chiranjeevi) ఎమోషనల్ పోస్ట్ వేశాడు. డియర్ బన్నీ నీ చిన్నతనంలోని జ్ఞాపకాలు నా మదిలో ఇంకా అలానే ఉన్నాయి.

Chiranjeevi : అల్లు అర్జున్ 20 ఇయర్స్ జర్నీ.. చిరు ఎమోషనల్ పోస్ట్!

Chiranjeevi emotional post on allu arjun 20 years career

Chiranjeevi : టాలీవుడ్ కి మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ (Allu Arjun).. తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని స్టైలిష్ స్టార్ గా, ఇప్పుడు ఐకాన్ స్టార్, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు సినిమాల్లో నటించిన అల్లు అర్జున్, చిరంజీవి డాడీ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించి అలరించాడు. అయితే హీరోగా ఇండస్ట్రీకి పరిచమైంది మాత్రం 2003 రిలీజ్ అయిన ‘గంగోత్రి’ సినిమాతోనే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. 2003 మార్చి 28న రిలీజ్ అయిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది. నిన్నటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి, అలాగే అల్లు అర్జున్ కెరీర్ స్టార్ట్ అయ్యి కూడా 20 ఏళ్ళు పూర్తి అయ్యింది.

Allu Arjun: స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్.. 20 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్!

దీంతో నిన్న అల్లు అర్జున్ తన 20 ఇయర్స్ జర్నీని గుర్తు చేసుకుంటూ ఒక పోస్ట్ వేశాడు. ”నన్ను ఆదరించి నేను ఈరోజు ఇంతటి స్థాయికి చేరుకునేలా చేసిన ప్రేక్షకులకు నా హృదయపూర్వ కృతజ్ఞతలు. అందుకు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అంటూ ట్వీట్ చేశాడు. ఇక అభిమానులు, ఇండస్ట్రీలోని ప్రముఖులు అల్లు అర్జున్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా అల్లు అర్జున్ పై ఎమోషనల్ పోస్ట్ వేశాడు.

Chiranjeevi : RRR టీంకి చిరు ఘన సన్మానం..

”డియర్ బన్నీ నువ్వు 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నీ చిన్నతనంలోని జ్ఞాపకాలు నా మదిలో ఇంకా అలానే ఉన్నాయి. అక్కడి నుంచి ఇప్పుడు నువ్వు స్టైలిష్ స్టార్ గా, ఐకాన్ స్టార్ గా, పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం వరకు.. మొత్తం నీ ఎదుగుదలని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. రానున్న కాలంలో నువ్వు మరింత ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ అల్లు అర్జున్ తో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ ట్వీట్ తో మెగా, అల్లు కుటుంబాలు మధ్య విబేధాలు ఉన్నాయి అంటూ వస్తున్న వార్తలకి చెక్ పడింది.