Gautham Raju : ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలుపుతూ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

చిరంజీవి తన ట్వీట్ లో.. ''గౌతంరాజు లాంటి గొప్ప ఎడిటర్ ని కోల్పొవటం దురదృష్టకరం. ఆయన ఎంత సౌమ్యడో, వారి ఎడిటింగ్ అంత వాడి. ఆయన మితభాషి, కానీ ఆయన ఎడిటింగ్ మెళకువలు......

Gautham Raju : ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలుపుతూ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

Gautham Raju

Gautham Raju :  తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ పరిశ్రమలో దాదాపు 800కి పైగా సినిమాలకి ఎడిటర్ గా పని చేసిన ప్రముఖ సినీ ఎడిటర్ గౌతంరాజు. గత కొంత కాలంగా గౌతంరాజు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం రాత్రి 1.30 గంటలకు ఇంట్లోనే మరణించారు. గౌతంరాజు మరణంతో టాలీవుడ్ తో పాటు సౌత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురయింది.

ఎన్నో సంవత్సరాలుగా చాలా సినిమాలకు ఎడిటర్ గా పని చేస్తూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలని అందించి అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు. గౌతంరాజు మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి సంతాపం తెలియచేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గౌతంరాజు మృతిపై సంతాపం తెలుపుతూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.

Gautham Raju : ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత.. విషాదంలో సినీ పరిశ్రమ..

చిరంజీవి తన ట్వీట్ లో.. ”గౌతంరాజు లాంటి గొప్ప ఎడిటర్ ని కోల్పొవటం దురదృష్టకరం. ఆయన ఎంత సౌమ్యడో, వారి ఎడిటింగ్ అంత వాడి. ఆయన మితభాషి, కానీ ఆయన ఎడిటింగ్ మెళకువలు అపరిమితం. ఎంత నెమ్మదస్తుడో, ఆయన ఎడిటింగ్ అంత వేగం. నా ‘చట్టానికి కళ్లు లేవు’ సినిమా నుంచి ‘ఖైదీ నెం150’ వరకు ఎన్నో చిత్రాలకు వర్క్ చేశారు. గౌతంరాజు మరణం వ్యక్తిగతంగా నాకూ, చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను” అని పోస్ట్ చేశారు.