Rangamarthanda : ప్రతి ఆర్టిస్ట్ జీవితమే రంగమార్తాండ.. చిరు ఎమోషనల్ ట్వీట్!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్సకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించిన సినిమా 'రంగమార్తాండ' (Ranga Maarthaanda). ఈ సినిమాని మొదటిరోజే చూసిన చిరంజీవి (Chiranjeevi).. తాజాగా ఎమోషనల్ పోస్ట్ వేశాడు.

Rangamarthanda : ప్రతి ఆర్టిస్ట్ జీవితమే రంగమార్తాండ.. చిరు ఎమోషనల్ ట్వీట్!

Chiranjeevi emotional tweet on Rangamarthanda movie

Rangamarthanda : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దాదాపు 6 ఏళ్ళ తరువాత ‘రంగమార్తాండ’ (Ranga Maarthaanda) అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కి ఇది రీమేక్ గా తెరకెక్కింది. ఉగాది కానుకగా మార్చి 22న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఫుల్ ఎమోషన్స్ ప్రతి ఒకర్ని కంటితడి పెట్టేలా చేస్తున్న ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో నటించగా.. రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ, ఆదర్శ్ ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కింది.

Rangamarthanda Review : రంగమార్తాండ.. మన అమ్మానాన్నల కథ.. సినిమా అంతా ఏడిపించేశారు..

తన విలక్షణమైన నటనతో ఏ పాత్రకి అయిన ప్రాణం పొసే ప్రకాష్ రాజు.. ఈ సినిమాలో కూడా జీవించేశాడు. ఇక ఈ మూవీ గురించి మాట్లాడాలి అంటే మొదటి బ్రహ్మానందం గురించే మాట్లాడుకోవాలి అన్నంత గొప్పగా నటించాడు. ఇప్పటి వరకు హాస్యబ్రహ్మగా మనల్ని నవ్వించిన బ్రహ్మానందం.. ఈ సినిమాలో బాగా ఏడిపించేశాడు. ఈ సినిమాని మొదటిరోజే చూసిన చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan) అండ్ ఫ్యామిలీ.. బ్రహ్మానందాన్ని ప్రత్యేకంగా సత్కరించారు. తాజాగా రంగమార్తాండ గురించి ఎమోషనల్ పోస్ట్ వేశాడు.

Brahmanandam: ‘రంగమార్తాండ’లో బ్రహ్మానందం నటనకు ఫిదా.. సన్మానం చేసిన మెగా ఫ్యామిలీ!

‘రంగమార్తాండ’ చూశాను. ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఇది ఒకటి. ప్రతి ఆర్టిస్ట్ కి తన జీవితాన్నే కళ్ళ ముందు చూస్తున్నట్టనిపిస్తుంది. అలాగే ఈ చిత్రం ఓ ‘త్రివేణీ సంగమం’లా అనిపించింది. కృష్ణవంశీ లాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్, ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు, ఒక హాస్య బ్రహ్మానందంల కలయిక, వారి పనితనం, ముఖ్యంగా ఆ ఇద్దరు అద్భుతమైన నటుల నటన ఎంతో భావోద్వేగానికి గురిచేసింది.

బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న ఓ అనూహ్య మైన పాత్రని చేయటం తొలిసారి. సెకండ్ హాఫ్ మొత్తం అప్రయత్నంగానే కంట తడి నిండింది. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇలాంటి చిత్రాలు అందరూ చూసి ఆదరించవలసినవి. ఇలాంటి రసవత్తరమైన చిత్రం తీసిన కృష్ణవంశీకి, ప్రకాష్ రాజ్ కి, రమ్యకృష్ణకి చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు.