K Vasu : ఇండస్ట్రీలో మరో విషాదం.. చిరంజీవి ఫస్ట్ మూవీ దర్శకుడు మృతి..

చిరంజీవిని వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు కె వాసు నేడు కన్నుమూశారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో..

K Vasu : ఇండస్ట్రీలో మరో విషాదం.. చిరంజీవి ఫస్ట్ మూవీ దర్శకుడు మృతి..

Chiranjeevi First movie Director K Vasu passed away

Chiranjeevi Director K Vasu : సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న మరణాలు అందర్నీ కలిచి వేస్తున్నాయి. అలనాటి సంగీత దర్శకుడు రాజ్ కోటి ద్వయంలో ఒకరైన రాజ్ మరణించడం అందర్నీ షాక్ కి గురి చేసింది. ఆయన మరణ వార్త నుంచి కోలుకోక ముందే సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) మరణం ప్రతిఒకర్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు మరో మరణవార్త టాలీవుడ్ ని పూర్తిగా దుఃఖ సంద్రంలోకి నెట్టేస్తుంది. ప్రముఖ దర్మక నిర్మాత కె వాసు నేడు (మే 26) కన్నుమూశారు.

Sarath Babu : శరత్ బాబుకు పిల్లలు లేరు.. కోట్ల ఆస్తులన్నీ వాళ్ళకే..?

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రిందటే ఫిల్మ్ నగర్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా మన మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) ఆడియన్స్ కి పరిచయం చేసింది ఈ దర్శకుడే. చిరంజీవి ‘ప్రాణంఖరీదు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన విషయం అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమాని డైరెక్ట్ చేసింది కె వాసునే. ఆ తరువాత కూడా చిరుతో కలిసి కోతలరాయుడు, తోడు దొంగలు, అల్లులొస్తున్నారు.. వంటి సినిమాలు కూడా చేశారు.

Raj – Koti : కొన్నేళ్ల క్రితం విడిపోయిన రాజ్ – కోటి.. చివరిసారిగా ఇటీవలే కలిసి..

ఇక డివోషనల్ మూవీస్ లో ఒక క్లాసిక్ గా ఉన్న విజయ చందర్ ‘శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం’ని కూడా ఈయనే డైరెక్ట్ చేశారు. అలాగే ‘అయ్యప్ప స్వామి మహత్యం’ని కూడా వాసునే డైరెక్ట్ చేశారు. ఇక బ్రహ్మానందంని హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసిన వ్యక్తి కూడా ఈయనే. ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ సినిమాలో బ్రహ్మానందంని హీరోగా చూపించారు. శ్రీకాంత్, ప్రభుదేవాలతో ‘ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి’ చిత్రాన్ని తీసి హిట్ అందుకున్నారు. ఈ సినిమా తను 1981 లో డైరెక్ట్ చేసిన ‘పక్కింటి అమ్మాయి’ చిత్రానికి రీమేక్ గా వచ్చింది.