Gang Leader: మెగా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. వాయిదా పడ్డ చిరంజీవి మూవీ!
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ సినిమా ఏకంగా రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించాడు.

Gang Leader: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ సినిమా ఏకంగా రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించాడు.
Gang Leader : మూడు భాషల్లో నాని సినిమా రీమేక్..
ఇక ఈ సినిమా సక్సెస్‌ను మెగా ఫ్యాన్స్ ఇంకా ఎంజాయ్ చేస్తుండగా, మెగాస్టార్ మరో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల రీ-రిలీజ్ చిత్రాల జోరు సాగుతుండటంతో, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ బ్లాక్‌బస్టర్ మూవీని కూడా త్వరలో రీ-రిలీజ్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అయ్యారు. దర్శకుడు విజయ బాపినీడు తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతన్నట్లు చిత్ర మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు.
అయితే, కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమా రీ-రిలీజ్‌ను వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో ఈ సినిమా రీ-రిలీజ్ కోసం ఆసక్తిగా ఉన్న అభిమానుల్లో తీవ్ర నిరాశ ఎదురయ్యింది. మరి ఈ సినిమాను ఎప్పుడు రీ-రిలీజ్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది.