Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్.. వారందరికి ఉచితంగా కరోనా టీకా

సినీ కార్మికులకు మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ (సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కొవిడ్‌-19 టీకా ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని చిరంజీవి తెలిపారు.

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్.. వారందరికి ఉచితంగా కరోనా టీకా

Chiranjeevi

Chiranjeevi : సినీ కార్మికులకు మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ (సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కొవిడ్‌-19 టీకా ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని చిరంజీవి తెలిపారు. ‘గతేడాది కరోనా వైరస్‌ సృష్టించిన క్లిష్ట పరిస్థితుల్లో కరోనా క్రైసిస్‌ ఛారిటీని ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు సాయం చేశాం. అందులో ఇంకొంత మొత్తం మిగిలి ఉంది. దానితో సినీ కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్‌ ఇప్పించాలనే ఆలోచన మాకు వచ్చింది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం’ అని చిరంజీవి అన్నారు.

అక్కినేని నాగార్జున నటించిన ‘వైల్డ్‌డాగ్‌’ ప్రెస్‌మీట్‌లో చిరంజీవి పాల్గొన్నారు. సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు చిరు. ప్రతిఒక్కరూ చూడాల్సిన సినిమా అన్నారు. మంచి కథా చిత్రాన్ని అందించారు అంటూ దర్శక నిర్మాతలను కొనియాడారు. టాలీవుడ్‌లో ఇలాంటి చిత్రాలు మరెన్నో రావాలని ఆకాంక్షించారు.