Chiranjeevi :రాజనాల గుండె చప్పుడు కొణిదెల.. ఆపరేషన్ విజయవంతం.. చిరు కళ్లల్లో ఆనందం..

మెగాస్టార్ చిరంజీవి సహాయంతో రాజనాల నాగలక్ష్మి ఆపరేషన్ విజయవంతం..

Chiranjeevi :రాజనాల గుండె చప్పుడు కొణిదెల.. ఆపరేషన్ విజయవంతం.. చిరు కళ్లల్లో ఆనందం..

Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి సాయం చేసి మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు. ఈ మేరకు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్ష్యులు రవణం స్వామినాయుడు ఆ వివరాలు తెలియచేస్తూ ఓ లేఖ విడుదల చేశారు.
‘చిరు సహాయంతో ఈ రోజు రాజనాల నాగలక్ష్మి గారి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. స్టార్ హాస్పిట‌ల్ చైర్మెన్ & మేనేజింగ్  డైరెక్ట‌ర్  డాక్ట‌ర్  ఎమ్. గోపీచంద్ గారి ఆధ్వర్యంలో సుమారు 3.30 నిమిషాల పాటు కొనసాగిన స‌ర్జ‌రీ చాలా విజయవంతం అయ్యింది. ఈ రోజు మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. ఆమెకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స‌క్సెస్‌ఫుల్‌గా సర్జరీ  జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఆపరేషన్ గురించి చిరంజీవి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే వున్నారు.

ఆపరేషన్ పూర్తి అవ్వగానే డాక్ట‌ర్ గోపీచంద్ ఫోన్ చేసి చిరంజీవికి తెలియజేసారు. చిరంజీవి చాలా సంతోషంతో ఆ విషయాన్ని మా అందరికి తెలియజేసారు. చిరంజీవి గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని ముక్కోటి దేవతలను ప్రార్ధిద్దాము’. రవణం స్వామినాయుడు , అఖిల భారత చిరంజీవి యువత..

మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు..
ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ‘డాక్ట‌ర్ గోపీచంద్ గారికి..వాళ్ల బృందానికి ధ‌న్య‌వాదాలు. అలాగే ఈ విష‌యాన్ని స‌మ‌యానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడికి, హైద‌రాబాద్ వ‌ర‌కూ రావ‌టానికి ఏర్పాట్లు చేసిన బి. దిలీప్ గారికి, ఇంతదూరం ప్ర‌యాణించ‌డానికి అనుమ‌తిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారుల‌కి..ఇత‌ర సిబ్బందికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను’ అన్నారు.

Read Also : నాగలక్ష్మికి చిరు సాయం.. అదే ఆమె గుండె చప్పుడు..