Chiranjeevi : నాకేంటి, నా కుటుంబానికేంటి అని ఆలోచించా ఇన్నాళ్లు.. చిరు సంచలన కామెంట్స్!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న 'రంగమార్తాండ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ చిత్రంలోని ఒక కవితాఝరి కోసం చిరంజీవి గొంతు సవరించాడు. 'నేనొక నటుడిని' అంటూ సాగిన ఆ షాయిరీ అనుభవాన్ని చిరంజీవి, కృష్ణవంశీతో పంచుకుంటూ, వ్యక్తగత విషయాలని కూడా బయటపెట్టాడు.

Chiranjeevi : నాకేంటి, నా కుటుంబానికేంటి అని ఆలోచించా ఇన్నాళ్లు.. చిరు సంచలన కామెంట్స్!

chiranjeevi hot comments on his life

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ చిత్రంలోని ఒక కవితాఝరి కోసం చిరంజీవి గొంతు సవరించాడు. ఇటీవలే ఆ కవితా గీతాన్ని దర్శకుడు కృష్ణవంశీ విడుదల చేయగా అందర్నీ ఆకట్టుకుంటుంది. ‘నేనొక నటుడిని’ అంటూ సాగిన ఆ షాయిరీ అనుభవాన్ని చిరంజీవి, కృష్ణవంశీతో పంచుకున్నాడు.

Chiranjeevi: తండ్రి సంవత్సరీకం సందర్భంగా చిరు ఎమోషనల్ పోస్ట్!

“ఈ షాయిరీని మీరు ‘రంగమార్తాండ’ సినిమా కోసం చేసినట్లు లేదు, నాకోసం చేసినట్లు ఉంది. ఈ కవితాఝరికి నా సినిమాలోని కొన్ని సన్నివేశాలను మీరు జత చేసిన తీరుని చూసి.. ఇన్ని పాత్రలు చేసినా? ఇన్ని షేడ్స్ ఉన్నాయా నాలో అని నేనే ఆశ్చర్యపోయా” అంటూ తన అనుభవాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి, వ్యక్తగత విషయాలని కూడా బయటపెట్టాడు.

“ఆర్టిస్ట్ ఇమేజ్ తన వ్యక్తిగత జీవితం కంటే గొప్పగా ఉంటది అంటారు. కానీ దాని నేను.. ‘స్టార్‌డమ్ కంటే వ్యక్తిగత జీవితమే గొప్పది’ అనేలా తిరగ రాయాలి అనుకుంటున్నా. ఆ క్రమంలోనే సామజిక సేవలు చేశా. కాని ఇన్నాళ్లు ఎంతోకొంత నా స్వార్ధం చూసుకున్నా. నాకేంటి, నా కుటుంబానికేంటి అని ఆలోచించా ఇన్నాళ్లు. కానీ ఇప్పుడు నా కుటుంబసభ్యులు అంతా అత్యున్నత స్థాయిలో ఉన్నారు. భగవంతుడు కూడా నేను అనుకున్న దానికంటే ఎక్కువే ఇచాడు.

దాని తిరిగి సమాజానికి ఇవ్వాలి అనుకుంటున్నా. ఇప్పటివరకు ఇచ్చింది చాలా తక్కువ, ఇవ్వాల్సింది ఇంకా ఉంది. ఇది మొదలు మాత్రమే, మునుముందు ఇంకెన్నో సేవలు అందించనున్నాను. అందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నా. స్టార్‌డమ్ శాశ్వతం కాదు, వ్యక్తిత్వమే శాశ్వతం. అలా నా పర్సనల్ లైఫ్, సినీ లైఫ్ ని డామినేట్ చేసేలా బ్రతుకుతా” అంటూ తెలియజేశాడు.