Chiranjeevi : బాస్ స్పీడ్..! చిరుని ఇంప్రెస్ చేసిన మరో డైరెక్టర్..

ఆ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ విని ఇంప్రెస్ అయిన మెగాస్టార్.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి కనిపించు అని చెప్పారట..

Chiranjeevi : బాస్ స్పీడ్..! చిరుని ఇంప్రెస్ చేసిన మరో డైరెక్టర్..

Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో సినిమాలు స్పీడప్ చేస్తున్నారు. 150వ మూవీ ‘ఖైదీ నంబర్ 150’, 151 ‘సైరా’, 152 ‘ఆచార్య’.. ఇలా గ్యాప్ లేకుండా లైనప్ చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే.. ‘ఆచార్య’ కంప్లీట్ కాకుండానే ‘లూసీఫర్’ రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేసేశారు.

Chiranjeevi : ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ విషయమై.. మెగాస్టార్ ఆధ్వ‌ర్యంలో మీటింగ్..

తర్వాత యంగ్ డైరెక్టర్ బాబీతో సినిమా ఉంది. మెహర్ రమేష్, త్రివిక్రమ్, హరీష్ శంకర్ లాంటి మరికొందరు డైరెక్టర్లు లైన్‌లో ఉన్నారు. ఆ లిస్టులో ఇప్పుడు మరో దర్శకుడు కూడా చేరాడనే వార్త ఫిలింసర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.

Acharya : ‘ఆచార్య’లో శ్రీశ్రీ పలుకులు.. టార్గెట్ నేషనల్ అవార్డ్..?

‘ఈ రోజుల్లో’ అనే చిన్న సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి, వరుసగా విజయవంతమైన సినిమాలు చేస్తూ ప్రామిసింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మారుతి.. రీసెంట్‌గా చిరుని కలిసి కథ చెప్పారట. కథ విని ఇంప్రెస్ అయిన మెగాస్టార్.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి కనిపించు అని చెప్పారట. కొణిదెల ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నాయట.
ప్రస్తుతం గోపి చంద్‌తో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నారు మారుతి.

Chiranjeevi : జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో చిరంజీవి కోవిడ్ నిధి సేక‌ర‌ణ..