Chiranjeevi : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ దిల్ రాజుకి కౌంటర్ ఇచ్చాడా??

తాజాగా జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. నాకు తెలిసినంతవరకు ఒకే నిర్మాత రెండు భారీ సినిమాలు ఒకేసారి అది కూడా పండగకి రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. రెండు సినిమాలు వాళ్ళకి రెండు కళ్ళ లాంటివి...........

Chiranjeevi : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ దిల్ రాజుకి కౌంటర్ ఇచ్చాడా??

Chiranjeevi indirect counter to dil raju in Waltair Veerayya Pre release Event

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా, రవితేజ ముఖ్యపాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్స్ తో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. తాజాగా ఆదివారం రాత్రి వైజాగ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ఈ సారి సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహ రెడ్డి సినిమాలతో వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి సంక్రాంతి వార్ గ్రాండ్ గా ఉండబోతుంది. థియేటర్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారో అని అందరూ అనుకుంటుంటే మధ్యలో దిల్ రాజు వచ్చి తన వారసుడు సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ అంటూ చాలా థియేటర్స్ ని బ్లాక్ చేయడంతో ఇటు టాలీవుడ్ వర్గాలతో పాటు, చిరు బాలయ్య అభిమానులు కూడా దిల్ రాజు పై సీరియస్ అవుతున్నారు. కొన్ని రోజులు ఈ వివాదం నడిచింది. అయినా దిల్ రాజ్ తగ్గకపోవడంతో ఏదైతే అది అవుతుందని సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు మాత్రం ఫిక్స్ అయ్యారు.

అయితే తాజాగా జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. నాకు తెలిసినంతవరకు ఒకే నిర్మాత రెండు భారీ సినిమాలు ఒకేసారి అది కూడా పండగకి రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. రెండు సినిమాలు వాళ్ళకి రెండు కళ్ళ లాంటివి. వీరసింహ రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు రెండూ భారీ హిట్ అయి నిర్మాతలకి డబ్బులు రావాలి. కచ్చితంగా రెండు సినిమాలు హిట్ అవుతాయి. ఇది చూసి కొంతమంది కుళ్ళుకుంటారు, వాళ్ళని పట్టించుకోకండి అని అన్నారు.

Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ వేదికపై చిరు లీక్స్..

దీంతో ఆ కుళ్ళుకునేది దిల్ రాజు అని కామెంట్స్ చేస్తున్నారు. రెండు సినిమాలకి ఇప్పటికే బాగా పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే దిల్ రాజు వారసుడు సినిమాపై తెలుగులో అంతగా అంచనాలు లేవు. ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దిల్ రాజుని ఉద్దేశించి అని, దిల్ రాజుకి థియేటర్స్ విషయంలో ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడని అంటున్నారు.