Chiranjeevi: పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసేందుకు రెడీ అంటోన్న గాడ్‌ఫాదర్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరుకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను చిరు ఎంజాయ్ చేస్తుండగా, వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు.

Chiranjeevi: పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసేందుకు రెడీ అంటోన్న గాడ్‌ఫాదర్!

Chiranjeevi Interested To Work With Pawan Kalyan

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరుకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను చిరు ఎంజాయ్ చేస్తుండగా, వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు.

Chiranjeevi: మెగా 154 పోస్టర్, టీజర్‌పై చిరు క్లారిటీ

తాజాగా, సినిమా జర్నలిస్టులతో చిరు ముచ్చటించారు. ఈ సందర్భంగా చిరు కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను గాడ్‌ఫాదర్ సినిమా చేయడానికి ముఖ్య కారణం రామ్ చరణ్ అని చిరు తెలిపారు. ఇక ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందని చిరు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఓ విలేకరి చిరును ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేస్తారా అని చిరుని అడగ్గా.. తనకు మంచి కథ వస్తే, ఖచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చాడు.

ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరు, పవన్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు అప్పుడే ఆసక్తిగా చూస్తున్నారు.