Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ వేదికపై చిరు లీక్స్..

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న మాస్ మసాలా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. కె బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరు అండ్ రవితేజ ఇద్దరు హాజరయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఈ ఈవెంట్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఇక ఈ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ మూవీలోని పాత్రలు, విషయాలు లీక్ చేశాడు.

Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ వేదికపై చిరు లీక్స్..

Chiranjeevi leaked the characters and contents of the movie at Waltair Veerayya pre release

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న మాస్ మసాలా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరు అండ్ రవితేజ ఇద్దరు హాజరయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఈ ఈవెంట్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఇక ఈ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ మూవీలోని పాత్రలు, విషయాలు లీక్ చేశాడు.

Chiranjeevi : శృతిహాసన్‌ని ‘వీరసింహారెడ్డి’ ఫంక్షన్‌లో ఎవరో బెదిరించారు.. చిరంజీవి!

సినిమా మొదలయిన 25 నిమిషాల్లో రెండు సన్నివేశాలు ఉంటాయి. ఎక్కడా రాజీ పడకుండా దర్శకుడు బాబీ వాటిని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించాడు. అవి ఏంటంటే అని చెప్పబోతుంటే.. చిత్ర యూనిట్ ఆపేసింది. ఒక మూడ్ లో పడిపోయి సినిమా మొత్తం చెప్పేసేలా ఉన్నా. నన్ను గమనిస్తూ ఉండు బాబీ. కథ లీక్ చేస్తుంటే నన్ను ఆపు అంటూ.. చిరంజీవి మళ్ళీ తన స్పీచ్ మొదలు పెట్టాడు. ఆ తరువాత కూడా మళ్ళీ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలని లీక్ చేసేశాడు.

రవితేజ సెకండ్ హాఫ్ లో వస్తాడు. అతను వచ్చిన దగ్గర నుండి సినిమా ఇంకో లెవెల్ కి వెళుతుంది. మా ఇద్దరి పాత్రలు ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశం అని చేప్పబోతుంటే.. దర్శకుడు బాబీ ఆపేశాడు. అలాగే ఒక యాక్షన్ సన్నివేశంలో కూడా శృతిహాసన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది అంటూ తెలియజేశాడు. కేథ‌రిన్ థ్రెసా పాత్ర కథని మలుపు తిప్పే పాత్ర అయితే రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఈ కథని మొదలుపెట్టే పాత్ర అంటూ వెల్లడించాడు. రాజేంద్ర ప్రసాద్ అంటే కామెడీ క్యారెక్టర్ కాదు, చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ ఒక పోల్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు లీక్ చేశాడు.