Bholaa Shankar : స్విట్జర్లాండ్‌లో తమన్నాతో చిరు డ్యూయెట్.. విడుదల వరకు చిరు లీక్స్ ఫిక్స్ అంటున్న మెగాస్టార్!

స్విట్జర్లాండ్‌లో తమన్నాతో డ్యూయెట్ పడుతున్న చిరంజీవి.. అక్కడి నుంచి ఫోటోలు లీక్ చేశాడు. త్వరలోనే మరిన్ని లీక్స్ చేస్తాను అంటూ చెబుతూ..

Bholaa Shankar : స్విట్జర్లాండ్‌లో తమన్నాతో చిరు డ్యూయెట్.. విడుదల వరకు చిరు లీక్స్ ఫిక్స్ అంటున్న మెగాస్టార్!

Chiranjeevi leaks Bholaa Shankar song shoot pics with Tamannaah

Chiranjeevi Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజాగా చిత్రం భోళా శంకర్. తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కి ఇది రీమేక్ గా వస్తుంది. మెహర్ రమేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుతున్న చిత్ర యూనిట్.. ఇటీవలే సాంగ్ షూట్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పై ఒక డ్యూయెట్ సాంగ్ ని శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా చిరంజీవి అభిమానులను ఖుషీ చేసేందుకు అక్కడి నుంచి ఫోటోలను లీక్ చేశాడు.

Cannes 2023 : కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉక్రెయిన్‌ నిరసన.. ఒంటిపై రక్తంతో మహిళ..

అందమైన లోయలో పాటని చిత్రీకరిస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ.. “ఈ పాట ప్రేక్షకులందరికి నచ్చుతుంది. ముఖ్యంగా అభిమానులందరినీ మరింతగా మెప్పిస్తుందని చెప్పగలను. త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం. అప్పటివరకూ ఈ చిరు లీక్స్ పిక్స్” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఇప్పుడు షూట్ చేస్తున్న సాంగ్ ని.. చిరు సూపర్ హిట్ సాంగ్ ‘దాయి దాయి దామ్మా’ లొకేషన్స్ లో చిత్రీకరిస్తున్నారు. దీంతో ఈ సాంగ్ పై ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

Bro : స్పెషల్ సాంగ్‌లో Bro తో చిందేయడానికి పోటీ పడుతున్న భామలు.. నిజమేనా?

ఇక ఈ సినిమాకి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. మణిశర్మ, చిరు కాంబినేషన్ లో ఎన్నో మెలోడీస్ అండ్ డాన్స్ నెంబర్ హిట్స్ వచ్చాయి. మరి ఇప్పుడు స్వరసాగర్ ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ (Keerthy Suresh) చిరంజీవికి చెల్లిగా కనిపించబోతుంది. అక్కినేని హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆగష్టు 11న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది.