Chiranjeevi : మెగా అభిమానులతో చిరంజీవి సమావేశం

ఇవాళ ఆక్సిజన్ సేవల్లో పాల్గొన్న తెలంగాణ జిల్లాల మెగా ప్రతినిధుల్ని పిలిచి చిరంజీవి అభినందించారు. హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.

Chiranjeevi : మెగా అభిమానులతో చిరంజీవి సమావేశం

Chiranjeevi

Chiranjeevi :  కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందికి సేవలందించారు. అయితే ఈ సేవలన్నిటిలోను మెగా అభిమానులు పాలు పంచుకున్నారు. ఇవాళ ఆక్సిజన్ సేవల్లో పాల్గొన్న తెలంగాణ జిల్లాల మెగా ప్రతినిధుల్ని పిలిచి చిరంజీవి అభినందించారు. హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… కరోనా సమయంలో నా అభిమానుల్ని చాలా మందిని కోల్పోయి ఆవేదన చెందాను. కరోనా భారిన పడి మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని అన్నారు. అభిమానులని ఉద్దేశించి మీరంతా పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకుని సేవాకార్యక్రమాల్లో భాగమైనందుకు కార్యాచరణలో పెట్టిన సైనికులుగా ఉన్నందుకు నా అదృష్టంగా భావిస్తాను అని అన్నారు. ప్రతిక్షణం అభిమానుల పట్ల కృతజ్ఞతతో ఉన్నానని అన్నారు. కరోనా టైములో ఆక్సిజన్ అందక చాలా మంది చనిపోతున్నారు అని బాధపడుతూ ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆక్సిజన్ బ్యాంకులు పెడదామని నా స్నేహితుడు జీకే సూచించారు. తను, నేను, రామ్ చరణ్, మా మిత్రులంతా కలిసి వారంలోనే ప్రారంభించాలని అనుకున్నాం. కరోనా పరిస్థితిలో అభిమానులు ముందుకొస్తారా అనుకున్నాను కానీ నా పిలుపు విని మీరంతా అండగా నిలవడం ఎనలేని ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. అనుకున్నదే తడవుగా వారంలోనే ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి అవసరమైన వాళ్లకి అందించగలిగాం అంటే ఆ క్రెడిబిలిటీ అభిమానులదే. మధ్యలో ఆక్సిజన్ దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాము. అలాంటి సమయాల్లో కూడా అభిమానులు నా వెంట నిలిచారు అని అన్నారు.

Multiplex : మల్టిప్లెక్స్ లు కడుతున్న హీరోలు..

నా అభిమానులైన మీరు వేలాది మంది ప్రాణాలు కాపాడారు. ఒక శాతం కాదు నూటికి నూరు శాతం మీరు సేవలు చేశారు. ఇదంతా మెగా అభిమానుల గొప్పతనమే అని వ్యాఖ్యానించారు. వచ్చే వారంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మెగాభిమానులందరితో సమావేశం ఏర్పాటు చేయనున్నారని తెలిపారు.

Samantha : సినిమా చేయాలంటే కొత్త కండిషన్లు పెడుతున్న సమంత.. విడాకుల ఎఫెక్ట్??

ఈ సమావేశం లో మెగాభిమానులు మాట్లాడుతూ… కరోనా కష్ట కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్ని కాపాడేందుకు చిరంజీవి గారు ఆక్సిజన్ సిలిండర్స్ సరఫరా కార్యక్రమం చేశారు. మా వంతు సాయం చేసాం. మా సేవల్ని కొనియాడి సైనికులుగా అభివర్ణించారు. మీకోసం ప్రాణాలిచ్చే అభిమానుల్ని కష్ట సమయంలో మీరే వారి ప్రాణాల్ని కాపాడినందుకు అభినందిస్తున్నామని అన్నారు. ఇవాళ్టి సమావేశంలో తెలంగాణ అన్ని జిల్లాల నుంచే కాక కర్నాటక, ఒరిస్సా నుంచి చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులు వచ్చారు. వచ్చే వారం ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రతినిధులతో సమావేశం ఉండబోతుంది.