Chiranjeevi: డైరెక్టర్స్‌కు మెగా ఇన్‌స్ట్రక్షన్స్.. ఈసారి గురి తప్పేదేలే!

యంగ్ హీరోలకు ధీటుగా వరుస సినిమాలకు సైన్ చేశారు. రిటైరయ్యే ఏజ్ లో కూడా మెగాస్టార్ క్రేజ్ చూపించారు. కానీ ఒక్క ఆచార్య కొట్టిన దెబ్బతో ఢీలా పడ్డారు చిరంజీవి.

Chiranjeevi: డైరెక్టర్స్‌కు మెగా ఇన్‌స్ట్రక్షన్స్.. ఈసారి గురి తప్పేదేలే!

Chiranjeevi

Chiranjeevi: యంగ్ హీరోలకు ధీటుగా వరుస సినిమాలకు సైన్ చేశారు. రిటైరయ్యే ఏజ్ లో కూడా మెగాస్టార్ క్రేజ్ చూపించారు. కానీ ఒక్క ఆచార్య కొట్టిన దెబ్బతో ఢీలా పడ్డారు చిరంజీవి. చేస్తున్న సినిమాలను ఎలా సరిచేయాలా అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. తను కమిట్ అయిన డైరెక్టర్స్ కు ప్రస్తుతం మెగా ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తున్నారు.

Chiranjeevi: మెగాస్టార్ కోసం ఇండియన్ మైఖేల్ జాక్సన్

కొత్తగా ఆలోచిస్తున్నారు.. మెగాస్టార్ కొత్త కొత్త డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఎంత ఫాస్ట్ గా సినిమాలను లైన్ లో పెట్టారో.. ఇప్పుడంత ఫాస్ట్ గా వాటిలో ఛేంజెస్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య విడుదలై భారీ డిజాస్టర్ గా మిగిలిన ఆచార్య ఎఫెక్ట్ రాబోయే మెగా సినిమాల మీద పడుతోంది. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రోజులు పోయాయని ఆచార్యతో తెలిసొచ్చింది. చిరూతో పాటూ ట్రిపుల్ ఆర్ స్టార్ చరణ్ ఉన్నా కంటెంట్ కనికరించకపోతే ఆడియెన్స్ తిప్పికొట్టేసారు. దాదాపు 80 కోట్ల దాకా నష్టాన్ని అకౌంట్ లో వేసుకున్న ఆచార్య దారిలో తర్వాతి సినిమాలు వెళ్లకుండా మెగాస్టార్ ముందే జాగ్రత్తపడుతున్నారు.

Chiranjeevi : ఈ లైనప్ ఏంటి బాసు.. మరో సినిమా ఓకే చేసిన మెగాస్టార్.. నిర్మాతగా ఒకప్పటి స్టార్ హీరోయిన్..

ప్రస్తుతం భార్యతో కలిసి ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న చిరూ.. వచ్చిన వెంటనే సెట్స్ పైఉన్న సినిమాలను చక్కదిద్దేలా ఆలోచిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న గాడ్ ఫాదర్ ఎండింగ్ స్టేజ్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా మార్పులు చేయడానికి ఏమీ లేవు. అందులోనూ సల్మాన్, నయనతార లాంటి భారీ కాస్టింగ్ ఉందందులో. ఆగస్ట్ 12న రిలీజ్ కూడా ఫిక్స్ చేసేలా ఉన్నారు. అయితే ప్రకటించినప్పుడే ఫ్యాన్స్ బెంబేలెత్తిన వేదాళం రీమేక్ భోళా శంకర్ గురించే ఇప్పుడు ఆందోళన. అలాంటి సబ్జెక్టులను ఇప్పుడు జనం పెద్దగా ఆదరించట్లేదు. అందులోనూ రజనీ అన్నాత్తేకు.. భోళాశంకర్ తో పోలీకలు కనిపిస్తున్నాయి. చెల్లెలుగా అదే కీర్తి సురేశ్. సో కథ, స్క్రీన్ ప్లేలో వీలైనన్ని మార్పులు, లుక్ ఛేంజ్ చేస్తే బెటరనేది చిరూ ఉద్ధేశ్యం.

Chiranjeevi: మెగా లైనప్.. సెట్స్ మీద ఐదు సినిమాలు.. చర్చల్లో మరో ఐదు!

భోళా శంకర్ తో వాల్తేర్ వీరయ్యకు ఆచార్య సెగ తగిలే ఛాన్స్ ఉంది. బాబీ తెరకెక్కిస్తోన్న వాల్తేర్ వీరయ్యలో రవితేజ కీ క్యారెక్టర్ చేస్తుండగా శృతీ హాసన్, క్యాథరీన్ థ్రెస్సా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ తో పాటూ చిరూ లుక్ పైనా ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేట్ అయినా మంచిదే కానీ ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేసుకోమని ఉచిత సలహాలిస్తున్నారు. మెగాస్టార్ సైతం ప్రస్తుతం ప్రేక్షకుల కోణం నుంచే ఆలోచించాలి. ఇక ఎలాగూ నెక్ట్స్ డైరెక్టర్ వెంకీ కుడుమలకు ఇంకాస్త టైమ్ పడుతోంది. చిరూతో సెట్స్ పైకెళ్లేలోపు కావాల్సినన్ని ఛేంజెస్ చేసుకోవచ్చు.