Chiranjeevi: మెగా లైనప్.. సెట్స్ మీద ఐదు సినిమాలు.. చర్చల్లో మరో ఐదు!

యంగ్ హీరోలకు షాక్ మీద షాకిస్తున్నారు మెగాస్టార్. 152 నుంచి 156వ సినిమా వరకు లైన్ పెట్టిన చిరూ.. ఆ లైనప్ ను పెంచే పనిలోనే ఉన్నారు. ఇంకో ఐదు ప్రాజెక్టులను యాడ్ చేసి కౌంట్ పెంచారిప్పుడు. కొవిడ్ తో ఆ మధ్య సినిమాలన్నీ వాయిదపడగా..

Chiranjeevi: మెగా లైనప్.. సెట్స్ మీద ఐదు సినిమాలు.. చర్చల్లో మరో ఐదు!

Chiranjeevi

Chiranjeevi: యంగ్ హీరోలకు షాక్ మీద షాకిస్తున్నారు మెగాస్టార్. 152 నుంచి 156వ సినిమా వరకు లైన్ పెట్టిన చిరూ.. ఆ లైనప్ ను పెంచే పనిలోనే ఉన్నారు. ఇంకో ఐదు ప్రాజెక్టులను యాడ్ చేసి కౌంట్ పెంచారిప్పుడు. కొవిడ్ తో ఆ మధ్య సినిమాలన్నీ వాయిదపడగా ఇప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేసేలా చిరూ మాత్రం లైనప్ పెంచేస్తున్నారు. కొడుకు రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దమవగా.. గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమా.. సమాంతరంగా చిరు మూడు చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

Chiranjeevi: మల్టీస్టారర్ మూవీలకు మెగాస్టార్ మక్కువ.. నెక్ట్స్ కూడా అదేనా..?

వాటితో పాటు యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ చిరు ఓ సినిమాను ఓకే చేశారు. పై మూడు సినిమాలలో ఒక్కటి గ్యాప్ దొరికినా వెంకీ సినిమాను సెట్స్ మీదకి ఎక్కించేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇవి కాకుండా మరో ఐదు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే చెప్పుకొచ్చాడు. ఆచార్య ప్రమోషన్లలో పాల్గొంటున్న చిరు.. ఓ ఇంటర్వూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ఇప్పుడు నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయనే అంతా అనుకుంటున్నారు. కానీ మరో ఐదు సినిమాలు సిద్ధమవుతున్నాయని షాకింగ్ విషయం చెప్పాడు.

Chiranjeevi: రౌడీ హీరోకు చెక్ పెట్టిన మెగాస్టార్..?

ఈ ఐదు సినిమాల గురించి ఎప్పుడైనా అనౌన్స్ మెంట్ రావొచ్చని తెలుస్తుంది. చిరూ ఆ మధ్య తన 157వ సినిమాను మారుతితో ఫైనల్ చేశారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో మెగా 158 సినిమాను ప్రకటించే ఛాన్స్ ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. మరి మిగతా మూడు సినిమాలు ఎవరితో చేయనున్నాడన్నది ఎక్కడా లీక్ కాలేదు. అయితే.. యువ హీరోలకు కూడా అందని విధంగా ఏకంగా పది సినిమాలు క్యూలో పెట్టినట్లు చిరంజీవి ప్రకటించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.