Chiranjeevi : చిరంజీవి కోసం నిన్నటి దాకా తండ్రి.. నేడు తనయుడు..

 మెగాస్టార్ సినిమా అంటే పాటలు కచ్చితంగా హిట్ అవుతాయి.ఎన్నో సంవత్సరాల నుంచి చిరంజీవి సినిమాల్లో గొప్ప గొప్ప సాంగ్స్ వచ్చాయి. చిరంజీవి చాలా సినిమాలకి మణిశర్మ సంగీతం అందించారు.

Chiranjeevi : చిరంజీవి కోసం నిన్నటి దాకా తండ్రి.. నేడు తనయుడు..

Mahathi

Chiranjeevi :  మెగాస్టార్ సినిమా అంటే పాటలు కచ్చితంగా హిట్ అవుతాయి.ఎన్నో సంవత్సరాల నుంచి చిరంజీవి సినిమాల్లో గొప్ప గొప్ప సాంగ్స్ వచ్చాయి. చిరంజీవి చాలా సినిమాలకి మణిశర్మ సంగీతం అందించారు. చిరంజీవి మణిశర్మ కాంబినేషన్ అంటే ఆ సినిమా సాంగ్స్ సూపర్ హిట్. ‘బావగారు బాగున్నారా’ సినిమా నుంచి ‘ఇంద్ర’ సినిమా వరకు చాలా సినిమాలకి మణిశర్మ సంగీతం అందించారు. ఆ సాంగ్స్ ఎంత బాగుంటాయో చెప్పనవసరం లేదు. చిరంజీవికి ఎన్నో మంచి పాటలని అందించారు మణిశర్మ. ఇప్పుడు ఆ బాధ్యత మణిశర్మ తనయుడు తీసుకోబోతున్నాడు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా నుంచి దసరాకి మంచి అప్‌డేట్ ఇచ్చారు. ఇవాళ దసరా సందర్భంగా చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ని అనౌన్స్ చేశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇవాళ మహతి పుట్టిన రోజు కూడా కావడంతో మహతికి విషెష్ చెప్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. మహతి ఇప్పుడిప్పుడే మంచి సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటున్నాడు. మహతి ఇప్పటి దాకా ‘చలో’, ‘బీష్మ’, ‘మాస్ట్రో’ లాంటి సినిమాలకి మంచి మ్యూజిక్ అందించాడు. కెరీర్ ఆరంభంలోనే మెగాస్టార్ మూవీ రావడం అంటే అదృష్టమని చెప్పాలి. మరి మహతి మెగాస్టార్ కి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి. చిరంజీవి మెహర్ రమేష్ మహతి స్వర సాగర్ కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Mahesh babu : రాజమౌళి సినిమాతోనే పాన్ ఇండియా ఎంట్రీ : మహేష్

ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. మరో పక్క ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ కూడా చేస్తున్నారు. ఈ రెండు పూర్తి అయ్యాక ‘భోళా శంకర్’ సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది. ఈ మూవీ తమిళ ‘వేదాళం’కి రీమేక్. ఈ సినిమాలో చిరంజీవితో పాటు ఆయన చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇప్పటికి హీరోయిన్ ఎవరు అని అనౌన్స్ చేయలేదు కానీ తమన్నా హీరోయిన్ గా ఉండే ఛాన్స్ ఉందని సమాచారం.