Adbhutam Movie : ‘అద్భుతం’ సినిమా ‘అద్భుతం’గా ఉంది – మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ‘అద్భుతం’ సినిమా చూసి టీమ్‌ను ప్రశంసించారు..

Adbhutam Movie : ‘అద్భుతం’ సినిమా ‘అద్భుతం’గా ఉంది – మెగాస్టార్ చిరంజీవి

Adbhutam Movie

Adbhutam Movie: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ, రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో వచ్చిన సినిమా ‘అద్భుతం’.. నవంబర్ 19న హాట్ స్టార్ డిస్నీలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుందీ చిత్రం.

Naga Chaitanya : నవ ‘మన్మథుడు’ వచ్చాడు.. ‘చిన్న బంగార్రాజు’ గా చైతన్య..

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందంటూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమా చూసి టీంను ప్రశంసించారు. మంచి సినిమా తీశారంటూ ‘అద్భుతం’ చిత్రబృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

Akhanda : రికార్డులు మొదలు.. సరైన మాస్ బొమ్మ పడితే.. బాలయ్యను ఆపడం కష్టం..

ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ‘‘నిన్న రాత్రే హాట్‌స్టార్‌లో ఈ ‘అద్భుతం’ సినిమా చూశాను. ఇదొక న్యూ ఏజ్ ఎంగేజింగ్ నోవెల్ సినిమా. తేజ సజ్జ, శివానీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. వాళ్లిద్దరూ చాలా ఇంప్రెసివ్‌గా నటించారు. చిత్ర బృందం అందరికీ మంచి భవిష్యత్తు ఉంది..’’ అంటూ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు మల్లిక్ రామ్‌ను ట్యాగ్ చేసి మరీ తన ప్రోత్సాహాన్ని అందించారు మెగాస్టార్.