Chiranjeevi : సత్యదేవ్ ని పొగిడేసిన మెగాస్టార్.. నా అభిమాని కావడం నాకు గర్వకారణం..

సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ''సత్యదేవ్ నటించిన కొన్ని సినిమాలు నేను కరోనా సమయంలో చూశాను. ఆ సినిమాలు చూసినప్పుడు కన్నడ నటుడని అనుకున్నాను. ఒకసారి సత్యదేవ్ ని ఇంటికి పిలిపించి...........

Chiranjeevi : సత్యదేవ్ ని పొగిడేసిన మెగాస్టార్.. నా అభిమాని కావడం నాకు గర్వకారణం..

Chiranjeevi praises Satyadev

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి నేడు దసరా రోజున గాడ్ ఫాదర్ గా ప్రేక్షకులని అలరించనున్నారు. మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ని తెలుగులో గాడ్‌ఫాదర్‌ గా చిరంజీవి రీమేక్ చేశారు. మోహనరాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా ఈ సినిమా నేడు అక్టోబరు 5న పాన్ ఇండియా వైడ్ రిలీజ్‌ అయింది.

నిన్నటివరకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సత్యదేవ్ ని బాగా పొగిడేశారు. గతంలో కూడా సత్యదేవ్ ని అభినందిస్తూ ట్వీట్ కూడా చేశారు చిరంజీవి.

తాజాగా గాడ్ ఫాదర్ ప్రెస్ మీట్ లో ఈ సినిమాకి ఎక్కువగా మీ అభిమానులే వర్క్ చేసినట్టు ఉన్నారు. అభిమానులతో వర్క్ చేయడం మీకెలా అనిపించింది అని అడగడంతో చిరంజీవి సమాధానమిస్తూ.. ”ఈ సినిమాకి అలా కుదిరింది. ఇంతమంది అభిమానులతో కలిసిచేయడం భగవంతుడు నాకిచ్చిన వరంగా భావిస్తాను. గతంలో ఓ సీనియర్ నటుడు నాకు చెప్పారు మనతో కలిసి పనిచేసే నటులు, టెక్నీషియన్స్ మన అభిమానులైతే కళ్ళుమూసుకొని సినిమా చేసేయొచ్చు అన్నారు. ఇప్పుడు నేను అదే చేశాను. సత్యదేవ్, లక్ష్మిభూపాల్, మోహన్ రాజా, గెటప్ శ్రీను.. ఇలా చాలా మంది అభిమానులతో కలిసి చేశాను. ఇదంతా యాదృచ్చికంగా జరిగింది” అని తెలిపారు.

ఇందులో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ”సత్యదేవ్ నటించిన కొన్ని సినిమాలు నేను కరోనా సమయంలో చూశాను. ఆ సినిమాలు చూసినప్పుడు కన్నడ నటుడని అనుకున్నాను. ఒకసారి సత్యదేవ్ ని ఇంటికి పిలిపించి మాట్లాడాను. అప్పుడు అతను తెలుగువాడని, నా అభిమాని అని తెలిసింది. ఈ సినిమాలో సత్యదేవ్ ని నేనే సూచించాను. భారతదేశంలోనే సత్యదేవ్ గొప్ప నటుడిగా పేరు తెచ్చుకుంటాడు” అని చిరంజీవి అతన్ని ఆకాశానికెత్తేశారు. ఒక అభిమానికి ఇంతకంటే ఏం కావాలని అంతా అనుకుంటున్నారు.