Chiranjeevi : బెంగాలీ సినిమాని ప్రమోట్ చేసిన మెగాస్టార్

బెంగాలీ సినిమా ‘బాబా బేబీ ఓ’ ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను తన ట్విట్టర్ లో షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి జిషుసేన్ కు విషెస్ తెలిపారు.......

Chiranjeevi :  బెంగాలీ సినిమాని ప్రమోట్ చేసిన మెగాస్టార్

Baba Baby O

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి వచ్చిన దగ్గర్నుంచి మరింత యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. తన ట్విట్టర్ అకౌంట్ లో అన్ని షేర్ చేస్తూ ఉంటారు. అందరికి విషెష్ చెప్తూ ఉంటారు. సినిమాలని కూడా తన ట్విట్టర్ ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ బెంగాలీ సినిమాని ప్రమోట్ చేశారు చిరంజీవి. ట్వీట్ లో బెంగాలీ భాషలో కూడా ప్రమోట్ చేశారు.

తెలుగులో అశ్వథ్థామ, భీష్మ, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలతో విలన్ గా పేరు తెచ్చుకున్న బెంగాలీ నటుడు జిషుసేన్ గుప్త. ఇక్కడ ఈయన విలన్ అయినా బెంగాలీలో మాత్రం స్టార్ హీరో. తాజాగా ఈయన నటించిన బెంగాలీ సినిమా ‘బాబా బేబీ ఓ’ ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను తన ట్విట్టర్ లో షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి జిషుసేన్ కు విషెస్ తెలిపారు.

Allu Arjun : తమిళ్ డైరెక్టర్‌తో బన్నీ పాన్ ఇండియా సినిమా

”ఫన్ అండ్ ఎమోషనల్ బెంగాలీ మూవీ ‘బాబా బేబీ ఓ’ ట్రైలర్ ను షేర్ చేస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నా స్నేహితుడు జిషుసేన్ గుప్తాకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు జిషుసేన్ గుప్తా. ఆ స్నేహంతో ఆయన బెంగాలీ సినిమా ట్రైలర్ ని షేర్ చేశారు చిరంజీవి.