తారక్, చరణ్ దుమ్ములేపారు.. మాలో ఉత్సాహాన్ని నింపారు..

‘RRR’ - ‘‘రౌద్రం రణం రుధిరం’’- స్పెషల్ వీడియోపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..

  • Published By: sekhar ,Published On : March 27, 2020 / 02:02 PM IST
తారక్, చరణ్ దుమ్ములేపారు.. మాలో ఉత్సాహాన్ని నింపారు..

‘RRR’ – ‘‘రౌద్రం రణం రుధిరం’’- స్పెషల్ వీడియోపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’ – ‘‘రౌద్రం రణం రుధిరం’’.. కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామ రాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ‘Bheem For Ramaraju‘ పేరుతో చరణ్ పోషిస్తున్న సీతారామ రాజు పాత్రను పరిచయం చేస్తూ వీడియో విడుదల చేసింది చిత్ర బృందం.. సీతారామ రాజుగా చరణ్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్‌లో ఫైర్.. అల్లూరి పాత్రలో అచ్చుగుద్దినట్టు దిగిపోయాడు.

సెంథిల్ కుమార్ విజువల్స్, కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ముఖ్యంగా సీతారామ రాజు పాత్రను పరిచయం చేస్తూ కొమరం భీం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ రొమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఈ వీడియో గురించి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియచేశారు.

‘‘అదిరింది రాజమౌళి.. మీ అంబులపొదిలోంచి వదిలిన రామబాణం ఈ సీతారామరాజు. అమోఘం తారక్.. దుమ్ము లేపారు. మాలో ఉత్సాహాన్ని నింపారు. చరణ్‌కి ఎప్పటికీ గుర్తుండిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇచ్చారు తారక్’’.. అంటూ చిరు ట్వీట్ చేశారు.