Chiranjeevi : కొరటాల శివ ఇష్యూ పై స్పందించిన చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు చిరంజీవి. ఈ క్రమంలోనే ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల శివ ఇష్యూ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Chiranjeevi : కొరటాల శివ ఇష్యూ పై స్పందించిన చిరంజీవి..

Chiranjeevi responded on the Koratala Siva issue

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా నేటి నుంచి ఆడియన్స్ ని అలరించబోతుంది. ఇప్పటికే పలు చోట్ల బెన్ఫిట్ షోలు పడడంతో థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సందడి మొదలయింది. ఈ సినిమాలో హీరో రవితేజ కూడా ఒక కీలక పాత్ర పోషించడంతో మాస్ మహారాజ్ అభిమానులు కూడా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు చిరంజీవి.

Waltair Veerayya Released : ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’.. అమెరికాలో 1200 స్క్రీన్స్, తెలుగు రాష్ట్రాల్లో 1200 థియేటర్స్ లో రిలీజ్

ఈ క్రమంలోనే ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల శివ ఇష్యూ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవి, కొరటాలతో కలిసి చేసిన ‘ఆచార్య’ సినిమా భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర పోషించడంతో చిరు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ సీన్ అంతా రివర్స్ అయ్యింది. కలెక్షన్‌లు కూడా రాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు రోడ్డు ఎక్కారు. అయితే చిరు అండ్ చరణ్ తమ రెమ్యూనరేషన్ లో సగభాగం వెనక్కి ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.

కాగా చిరంజీవి పలు సందర్భాల్లో ఆచార్య ఫెయిల్యూర్ కి డైరెక్టర్ కారణం అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా దీనిపై ప్రశ్నించగా, చిరంజీవి బదులిస్తూ.. ‘నేను అన్నది కేవలం కొరటాల శివని మాత్రమే కాదు. అందరి దర్శకులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించిన మాటలు అవి. అనవసరంగా కొరటాల శివకి, నాకు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా. స్క్రీన్ ప్లే అంతా రెడీ అయ్యాకే సెట్స్ పైకి వెళ్ళాలి. ఒక సినిమా అనుకున్న ఖర్చులో అవ్వాలి అన్నా, షూటింగ్ పూర్తి చేసుకోవాలి అన్నా.. దర్శకుడు వల్లే అది సాధ్యం అవుతుంది. పక్కా ప్రణాళిక లేకుండా 4 గంటల సినిమా తీసేసి, మళ్ళీ దానిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి 2:30 గంటల సినిమా రిలీజ్ చేస్తున్నారు. అది మార్చుకోవాలి అంటున్నా. ఇది కేవలం నేను కొరటాల శివాని దృష్టిలో పెట్టుకొని అనడం లేదు. డైరెక్టర్ ని కెప్టెన్ అఫ్ ది షిప్ అంటాము కాబట్టి, అందర్నీ ఉద్దేశించి అంటున్నా” అంటూ వ్యాఖ్యానించాడు.