Chiranjeevi : చిరంజీవి గారు పిలిచారు.. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్.. ‘ఆచార్య’తో రోజా మీటింగ్..

శుక్రవారం రాత్రి రోజా తన ఫ్యామిలీతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి వారిని ఆప్యాయయంగా రిసీవ్ చేసుకున్నారు. రోజా మంత్రి అయిన సందర్భంగా చిరంజీవి ఆమెని సత్కరించారు. ఇక రోజా కూతురిని చూసి..................

Chiranjeevi : చిరంజీవి గారు పిలిచారు.. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్.. ‘ఆచార్య’తో రోజా మీటింగ్..

Chiru

 

Chiranjeevi :  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. మెగాస్టార్ ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక చిరంజీవి ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత ఏపీ మంత్రి రోజాతో కలిసి గతంలో చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరి మధ్య సినిమా పరంగా మంచి సాన్నిహిత్యం ఉంది. తాజాగా నిన్న రాత్రి రోజా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.

శుక్రవారం రాత్రి రోజా తన ఫ్యామిలీతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి వారిని ఆప్యాయయంగా రిసీవ్ చేసుకున్నారు. రోజా మంత్రి అయిన సందర్భంగా చిరంజీవి ఆమెని సత్కరించారు. ఇక రోజా కూతురిని చూసి.. నిన్ను చూస్తుంటే మీ అమ్మని చిన్నప్పుడు చూసినట్టే ఉంది అని అన్నారు. రోజా.. తన కూతురు అన్షుని మీరు ఎత్తుకొని ఆడించారు, చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చింది అంటూ పాత జ్ఞాపకాలని గుర్తు చేసింది. ఆ తర్వాత చిరంజీవి సతీమణి సురేఖ కూడా వచ్చి రోజాని ఆప్యాయంగా హత్తుకొని పలకరించారు. అందరూ కూర్చొని పలు ఆసక్తికర విషయాలని మాట్లాడుకున్నారు.

Abhishek Bachchan : హిందీ సినిమాలకి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు.

చిరంజీవిని కలిసి వెళ్తూ రోజా మీడియాతో మాట్లాడారు. రోజా చిరంజీవితో మీటింగ్ గురించి మాట్లాడుతూ.. ”జస్ట్ క్యాజువల్ గా మీట్ అయ్యాము. నాకు మంత్రి పదవి వచ్చిందని తెలిసి పిలిచి అభినందించారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి చిరంజీవి గారు, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్” అని తెలిపారు. ఇక ఆచార్య సినిమా చూశారా అని అడగగా ఇప్పుడు చూడటానికి వెళ్తున్నాం అని తెలిపారు రోజా సెల్వమణి.