Chiranjeevi : వాల్తేరు వీరయ్య.. నాన్ రాజమౌళి రికార్డ్స్..

ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ మరోసారి సినిమా గురించి, సినిమాకి వర్క్ చేసిన వాళ్ళ గురించి, సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ....................

Chiranjeevi : వాల్తేరు వీరయ్య.. నాన్ రాజమౌళి రికార్డ్స్..

Chiranjeevi says waltair veerayya break non Rajamouli Records

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా రవితేజ ముఖ్య పాత్రలో బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. తాజాగా వాల్తేరు వీరయ్య భారీ విజయం సాధించినందుకు వరంగల్ లో వీరయ్య విజయ విహారం పేరిట భారీ సభని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు రామ్ చరణ్ కూడా విచ్చేశాడు.

Ram Charan : ఆయన్ని ఏమన్నా అంటే ఊరుకోము.. వాల్తేరు వీరయ్య స్టేజిపై రామ్ చరణ్ వార్నింగ్..

ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ మరోసారి సినిమా గురించి, సినిమాకి వర్క్ చేసిన వాళ్ళ గురించి, సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా తీస్తున్నప్పుడే హిట్ అవుతుంది అనుకున్నాము. కానీ ఈ రేంజ్ లో ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఈ సినిమా నాన్ బాహుబలి, నాన్ RRR స్థాయిలో హిట్ అయి కలెక్షన్స్ ని తీసుకొస్తుంది. వాల్తేరు వీరయ్య సినిమా నాన్ రాజమౌళి రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇంతటి సక్సెస్ ఇచ్చినందుకు ఈ సక్సెస్ అగ్ర తాంబూలం ప్రేక్షకులకే. నాకు మళ్ళీ ఇంతటి భారీ సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు అని తెలిపారు.