Chiranjeevi : రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినిమా విలువేంటో తెలుసుకున్నాను.. గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకల్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్' అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. కాగా నేడు ఈ అవార్డుని అందుకున్న చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Chiranjeevi : రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినిమా విలువేంటో తెలుసుకున్నాను.. గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

Chiranjeevi Sensational comments at goa film festival

Chiranjeevi : 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకలు గోవాలో ఘనంగా మొదలయ్యాయి. ఈ నెల 20న మొదలయిన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. కాగా భారత్ ప్రభుత్వం ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. చిరుకి ఈ గౌరవం దక్కడంతో.. ప్రధానిమంత్రి నరేంద్రమోదీ దగ్గర నుంచి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు వరకు చిరంజీవికి అభినందనలు తెలియజేశారు.

Chiranjeevi : భారతదేశ చలనచిత్ర రంగం నుంచి చిరంజీవికి అరుదైన గౌరవం..

కాగా నేడు ఈ అవార్డుని అందుకున్న చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “కొన్ని పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవి. నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సినీ రంగంలోకి అడుగుపెట్టాను. నా తల్లిదండ్రులు శివశంకర ప్రసాద్ గా నాకు జన్మనిస్తే, సినీ పరిశ్రమ నాకు చిరంజీవిగా జన్మనిచ్చింది. నాలుగున్నర దశాబ్దల సినీ ప్రయాణంలో పదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను.

అయినా ప్రేక్షకుల హృదయాల్లో నా స్థానం పదిలం గానే ఉంది. అంతేకాదు వాళ్ళు నాపై చూపించే ప్రేమ మరింత రెట్టింపైంది. నా జీవితాంతం చిత్ర పరిశ్రమలోనే ఉంటూ, తెలుగు ప్రేక్షకుల ప్రేమకు దాసున్ని అవుతా. రాజకీయాల్లోకి వెళ్లవడం వల్ల సినిమా విలువేంటో తెలుసుకున్నాను. ఏ రంగంలోనైనా అవినీతి ఉండొచ్చు కానీ సినీ పరిశ్రమలో అవినీతి లేదు సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే కొలమానం. నన్ను ఈ అవార్డుకు గుర్తించినందుకు ప్రదాని నరేంద్రమోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు.” అంటూ చిరంజీవి వ్యాఖ్యానించాడు.