Father’s Day 2021: మా నాన్నకి కోపమెక్కువ అంటున్న మెగాస్టార్.. చిరంజీవి తండ్రి ఏ సినిమాల్లో నటించారో తెలుసా?

సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా.. ఎవరి జీవితంలోనైనా తండ్రి పాత్ర ప్రత్యేకమే. ఏ ప్రాయంలోనైనా తండ్రి పాత్ర గురించి ప్రత్యేకంగా ఓ రోజు చెప్పుకునేందుకు ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా ఓ రోజును ఫాదర్స్‌ డే గా జరుపుకుంటూ ఉండగా.. ఈరోజు కూడా ఫాదర్స్ డే సంధర్భంగా టాలీవుడ్ హీరోలు, సెలబ్రిటీలు ప్రత్యేకమైన ఫోటోలను పంచుకుంటూ తమ తండ్రులపై గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Father’s Day 2021: మా నాన్నకి కోపమెక్కువ అంటున్న మెగాస్టార్.. చిరంజీవి తండ్రి ఏ సినిమాల్లో నటించారో తెలుసా?

Chiranjeevi Shares His Father Photo On Fathers Day

Father’s Day 2021: సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా.. ఎవరి జీవితంలోనైనా తండ్రి పాత్ర ప్రత్యేకమే. ఏ ప్రాయంలోనైనా తండ్రి పాత్ర గురించి ప్రత్యేకంగా ఓ రోజు చెప్పుకునేందుకు ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా ఓ రోజును ఫాదర్స్‌ డే గా జరుపుకుంటూ ఉండగా.. ఈరోజు కూడా ఫాదర్స్ డే సంధర్భంగా టాలీవుడ్ హీరోలు, సెలబ్రిటీలు ప్రత్యేకమైన ఫోటోలను పంచుకుంటూ తమ తండ్రులపై గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన తండ్రి ప్రత్యేకమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫాదర్స్ డే విషెస్ తెలియజేశారు.

మా నాన్నకి కోపమెక్కువ.. ఆ కోపానికి ప్రేమా ఎక్కువే -చిరంజీవి
మా నాన్నకి కోపం ఎక్కువ.. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి ఫాదర్స్ డే అంటూ చిరంజీవి కూడా త‌న నాన్న‌తో దిగిన ఫొటోని షేర్ చేసుకున్నారు. చిరంజీవి తండ్రి కొనిదెల వెంకట్రావు అనే సంగతి తెలిసిందే. వెంకట్రావు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.

కొనిదెల వెంకట్రావు కూడా ఓ సినిమాలో నటించిన విషయం చాలామందికి తెలియదు. చిరంజీవి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాపు దర్శకత్వంలో ‘మంత్రిగారి వియ్యంకుడు’ అనే సినిమా రూపొందింది. ఆ సినిమాలో వెంకట్రావు ఓ పాత్రలో నటించారు. చిరంజీవి సినిమాల్లోకి రాకముందే అంటే 1969లో ‘జగత్ కిలాడీ’ అనే సినిమాలోనూ వెంకట్రావు చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా కూడా కుటుంబ బాధ్యతల రీత్యా ఉద్యోగానికే పరిమితం అయ్యారు.

నా హీరో నాన్నే- మహేష్ బాబు
“నా హీరో, నా మార్గదర్శి, నా బలం, నా ఆదర్శం అన్నీ మా నాన్నే. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్న.”అంటూ మహేష్ బాబు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

నాన్న స్కూటర్‌పై సోనూసూద్:
“నాన్న.. మీరు మా మధ్య లేకపోవచ్చు.. కానీ, మీ ఫేవరెట్ స్కూటర్ నాకు ఎంతో అమూల్యమైనది.. అది నాతోనే ఉంటుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను” అంటూ సోనూసూద్ ట్విట్టర్‌లో ఫాద‌ర్స్ డే శుబాకాంక్ష‌లు తెలియ‌జేశారు.