Chiranjeevi : అల్లు స్టూడియో లాభాల కోసం కట్టింది కాదు.. అల్లు వారి తరతరాలు ఆయన్ని గుర్తుంచుకోవాలి..

నేడు అల్లురామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా కోకాపేటలో నూతనంగా కట్టిన ఈ అల్లుస్టూడియోస్ ని ఉదయం 10 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి.............

Chiranjeevi : అల్లు స్టూడియో లాభాల కోసం కట్టింది కాదు.. అల్లు వారి తరతరాలు ఆయన్ని గుర్తుంచుకోవాలి..

Chiranjeevi Speech at Allu Studios Launching Event

Chiranjeevi :  తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా ఎదిగి తన తర్వాత తన కుటుంబానికి సినీ పరిశ్రమలో బంగారు బాట వేశారు అల్లు రామలింగయ్య. నేడు అల్లురామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్ ని ప్రారంభించారు. అల్లు ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా అల్లు స్టూడియోస్ నిర్మాణం చేపట్టింది. కోకాపేటలో అల్లు స్టూడియోస్ ని నిర్మిస్తున్నారు. మొత్తం 10ఎకరాల్లో ఈ స్టూడియో నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే ఒక స్టూడియో ఫ్లోర్ పూర్తి అయింది. మరో స్టూడియో ఫ్లోర్ నిర్మాణంలో ఉంది. ముఖ్యంగా ఇండోర్ సినిమా షూటింగ్స్ కోసం ఈ స్టూడియోని నిర్మిస్తున్నారు. భవిష్యత్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకునేలా కూడా సన్నాహాలు చేస్తున్నారు అల్లు ఫ్యామిలీ.

నేడు అల్లురామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా కోకాపేటలో నూతనంగా కట్టిన ఈ అల్లుస్టూడియోస్ ని ఉదయం 10 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అభిమానులు హాజరు అయ్యారు. అల్లు రామలింగయ్య గారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రముఖులంతా మాట్లాడారు.

చిరంజీవి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ”అల్లు రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా వారికి నా నివాళి. ఎంతో మంది నటులున్నా కొద్దిమందికి మాత్రమే ఇలాంటి గొప్ప ఘనత, ఆప్యాయత లభిస్తుంది. రామలింగయ్య గారి బాటలో అరవింద్, బన్నీ, శిరీష్ ,బాబి విజయవంతంగా కొనసాగుతున్నారు. నాడు పాలకొల్లులో నటుడిగా ఎదగాలని రామలింగయ్య గారి ఆలోచనే నేడు ఓ వ్యవస్దగా అల్లు కుటుంబం ఎదిగేలా చేసింది. అల్లు వారి తరతరాలు ఆయన్ని తలుచుకుంటూనే ఉండాలి. అల్లు అరవింద్ కి గీత ఆర్ట్స్ సంస్థ స్థాపించి ఆయన ఒక దారి ఏర్పరిచారు. నేడు అరవింద్ అగ్ర నిర్మాతగా, మనవలు హీరోలుగా నిలదొక్కుకున్నారంటే అంతా అయన వల్లే.”

Rajamouli : ఇది అమెరికాలా లేదు.. అమీర్‌పేట్‌లా ఉంది..

”అల్లు స్టూడియో లాభాలకోసం కట్టింది అనుకోవట్లేదు. కానీ ఇది కూడా లాభాలు తీసుకురావాలి. ఇది అల్లు రామలింగయ్యగారికి కృతజ్ఞత, గుర్తింపు గా, అల్లు బ్రాండ్ ని నిలబెట్టాలని కట్టారు. తరతరాలు గుర్తుండేలా ఈ స్టూడియో కట్టినందుకు ధన్యవాదాలు. అల్లు ఫ్యామిలీలో భాగమవ్వటం నాకు ఆనందంగా వుంది. సాయంత్రం అల్లు రామలింగయ్య గారి శతజయంతి సభలో మళ్ళీ ఆయన గురించి మాట్లాడతాను. ప్రస్తుతం ముంబైలో సల్మాన్ తో గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ కు వెళ్లుతున్నాను మళ్ళీ సాయంత్రానికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటాను” అని తెలిపారు.