Chiranjeevi : అలా చేయలేనప్పుడు సినిమాల నుంచి రిటైర్ అయిపోవాలి..

ప్రెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. డైరెక్టర్ బాబీ కథ చెప్పినప్పుడు బాగుంది. సినిమా చూశాక ఇంకా బాగుంది. నా ఫ్యాన్ సినిమా తీస్తే నన్ను ఎలా చూపించాలో అలా చూపించాడు. చాలా వరకు ఎలాంటి సన్నివేశాలైనా డూప్ తో చేయడం.....................

Chiranjeevi : అలా చేయలేనప్పుడు సినిమాల నుంచి రిటైర్ అయిపోవాలి..

Chiranjeevi speech in Waltair Veerayya Pressmeet

Chiranjeevi :  చిరంజీవి, శృతి హాసన్ జంటగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి మరింత యంగ్ గా, మరింత ఎనర్జీగా కనిపిస్తుండం, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి.

తాజాగా వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి చిరంజీవి, రవితేజ, ఊర్వశి రౌతేలా, డైరెక్టర్ బాబీ, దేవిశ్రీ ప్రసాద్, రాజేంద్రప్రసాద్, నిర్మాతలు.. చిత్రయూనిట్ అంతా విచ్చేసి మాట్లాడారు. వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ కానుంది. సినిమా గురించి పలువురు అనేక విషయాలని పంచుకున్నారు ఈ ప్రెస్ మీట్ లో. అయితే ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతామని అన్నారు.

Chiranjeevi : బాలయ్య సినిమా, నా సినిమా.. రెండిటికి ఎలా న్యాయం చేయాలో నిర్మాతలకి తెలుసు..

ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. డైరెక్టర్ బాబీ కథ చెప్పినప్పుడు బాగుంది. సినిమా చూశాక ఇంకా బాగుంది. నా ఫ్యాన్ సినిమా తీస్తే నన్ను ఎలా చూపించాలో అలా చూపించాడు. చాలా వరకు ఎలాంటి సన్నివేశాలైనా డూప్ తో చేయడం నాకు నచ్చదు. ఈ సినిమాలో కూడా చాలా రిస్క్ సీన్స్ ని నేనే చేశాను. అలా చేస్తేనే నాకు సంతృప్తి ఉంటుంది. వేరే హీరోల గురించి నాకు తెలీదు, నేనైతే ఇలాగే చేస్తాను. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో మంచి సినిమాలు, మంచి పాత్రలు చేయాలనీ ఎంత ఆకలిగా, కసిగా ఉంటామో, ఎంత కష్టపడతామో వంద, రెండొందల సినిమాల తర్వాత కూడా అదే ఆకలితో, అదే కమిట్మెంట్ తో ఉండాలి. అప్పుడే మన వృత్తికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అలా చేయలేకపోతే సినిమాల నుంచి రిటైర్ అయిపోవాలి. నేను మాత్రం ఆ కమిట్మెంట్ కి ఇప్పటికి కట్టుబడి ఉన్నాను. ప్రేక్షకులు, ఫ్యాన్స్ సంతోషం కోసం గొడ్డులా కష్టపడతాను అని అన్నారు. దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.