Chiranjeevi: ఒకేసారి మూడు సినిమాలు.. మెగాస్టార్ షటిల్ సర్వీస్!

మెగాస్టార్ మాంచి స్పీడ్ మీదున్నారు. సిక్స్టీ ప్లస్ లో కూడా సిక్స్ టీన్ స్పీడ్ చూపిస్తున్నారు. కమిట్ అయిన సినిమాల్ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తూ.. ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్..

Chiranjeevi: ఒకేసారి మూడు సినిమాలు.. మెగాస్టార్ షటిల్ సర్వీస్!

Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ మాంచి స్పీడ్ మీదున్నారు. సిక్స్టీ ప్లస్ లో కూడా సిక్స్ టీన్ స్పీడ్ చూపిస్తున్నారు. కమిట్ అయిన సినిమాల్ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తూ.. ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం భోళాశంకర్ తో బిజీగా ఉన్న చిరంజీవి.. లేటెస్ట్ గా వాల్తేరు శీనుగా మారిపోయి సినిమాల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు.

Akhanda: మాస్.. మాస్.. మాస్.. దంచికొడుతున్న కలెక్షన్లు!

సీనియర్ స్టార్ అయినా కూడా.. సినిమాలు నిదానంగా ఒక దాని తర్వాత ఒకటి చేస్కోవచ్చులే అనుకోకుండా.. ప్యార్లల్ గానే షూటింగ్ చేస్తున్నారు మెగాస్టార్. ఒక వైపు ఆచార్య సినిమాని కంప్లీట్ చేసి ఫిబ్రవరి రిలీజ్ కు రెడీ చేస్తూనే.. మరో వైపు మోహన్ రాజాతో గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి మిగతా సినిమాల్ని కూడా బ్యాక్ టూ బ్యాక్ షూట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా బాబీతో స్టార్ట్ చేసిన మాస్ యాక్షన్ మూవీ షూట్ లో జాయిన్ అయ్యారు మెగాస్టార్.

RRR: గెట్ రెడీ.. ట్రైలర్ వచ్చేస్తుంది.. ఇక రచ్చ రచ్చే!

ఒక వైపు ఆచార్య, మరో వైపు గాడ్ ఫాదర్ సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్.. లేటెస్ట్ గా బాబీతో చేస్తున్న సినిమాని కూడా మొదలుపెట్టారు. వాల్తేరు శీను వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. చిరంజీవి 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మాస్ మూవీ లో చిరంజీవి ని చూస్తే పూనకాలే అంటూ ముందు నుంచే ఫ్యాన్స్ లో హైప్ క్రియేట్ చేస్తున్నారు టీమ్.

Liger: పూరి కోసం బాలయ్య.. లైగర్‌లో క్యామియో రోల్?

బాబీ తో ఫ్యాన్స్ కి ఫీస్ట్ రేంజ్ మూవీ షూటింగ్ చేస్తున్న చిరంజీవి.. మొన్నటి వరకూ మోహర్ రమేష్ కాంబినేషన్ లో స్టార్ట్ అయిన తన 155 భోళా శంకర్ సినిమా షూటింగ్ ని కూడా స్టార్ట్ చేశారు. వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్న భోళాశంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తోంది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ షూట్స్ తో షటిల్ సర్వీస్ చేస్తూ.. ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు చిరంజీవి.