Nani 30: నాని కోసం వస్తున్న మెగాస్టార్.. ఆసక్తిగా చూస్తున్న అభిమానులు!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’కు సంబంధించిన టీజర్ ఇవాళ రిలీజ్ చేయగా, దానికి అభిమానుల దగ్గర్నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతోంది. పూర్తి ఊరమాస్ అవతారంలో నాని పర్ఫార్మెన్స్‌ను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకుముందే, నాని తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశాడు. నాని కెరీర్‌లో 30వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను శౌర్యువ్ డైరెక్ట్ చేయనున్నాడు.

Nani 30: నాని కోసం వస్తున్న మెగాస్టార్.. ఆసక్తిగా చూస్తున్న అభిమానులు!

Chiranjeevi To Grace Nani 30 Pooja Ceremony

Nani 30: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’కు సంబంధించిన టీజర్ ఇవాళ రిలీజ్ చేయగా, దానికి అభిమానుల దగ్గర్నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతోంది. పూర్తి ఊరమాస్ అవతారంలో నాని పర్ఫార్మెన్స్‌ను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకుముందే, నాని తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశాడు. నాని కెరీర్‌లో 30వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను శౌర్యువ్ డైరెక్ట్ చేయనున్నాడు.

Nani 30: జనవరి 31న పూజా కార్యక్రమాలతో నాని 30 స్టార్ట్..!

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. కాగా, తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను చిత్ర యూనిట్ ఇచ్చింది. ఈ సినిమాను జనవరి 31న పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Nani 30 : మరోసారి తండ్రి పాత్రలో నాని.. ఆకట్టుకుంటున్న నాని30 గ్లింప్స్!

చిరు రాకతో ఈ సినిమా ప్రారంభోత్సవం గురించి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని సరసన సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా, తండ్రీకూతుళ్ల బాండింగ్‌పై ఈ సినిమా కథ నడవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండగా, హీషామ్ అబ్దుల్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.