Ravanasura : మెగాస్టార్ ముఖ్య అతిథిగా!

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ ప్రారంభం..

Ravanasura : మెగాస్టార్ ముఖ్య అతిథిగా!

Ravanasura

Ravanasura: మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల మధ్య ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరు స్పూర్తితోనే ఎవరి సపోర్ట్ లేకుండా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు రవితేజ. చిరుకి తమ్ముడిగా ‘అన్నయ్య’ లో నటించిన రవితేజ మరోసారి చిరు తమ్ముడిగా కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

Chiranjeevi : ముగిసిన మెగా భేటీ.. టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడనుందా?

కట్ చేస్తే.. ఇప్పుడు రవితేజ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి చిరు ముఖ్య అతిథిగా విచ్చేస్తుండడంతో ఆ వార్తలు నిజమేననుకోవాలంటున్నారు ఇండస్ట్రీ జనాలు.. గతేడాది ‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ కొట్టి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు.. పాండమిక్ తర్వాత టాలీవుడ్‌కి కొత్త శుభారంభాన్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

Chiru 154: చిరుకి తమ్ముడిగా మాస్ రాజా.. బర్త్ డే రోజు ప్రకటన!

రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’, కొత్త డైరెక్టర్ శరత్ మండవ డైరెక్షన్లో ‘రామారావు – ఆన్ డ్యూటీ’, త్రినాధరావు నక్కినతో ‘ధమాకా’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలతో పాటుగా సుధీర్ వర్మతో ‘రావణాసుర’ అనే మరో సినిమా అనౌన్స్ చేశారు.

Sushanth : ‘రావణాసుర’ లో ‘రామ్’ గా..

రవితేజ హీరోగా నటిస్తున్న 70వ సినిమా ఇది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. జనవరి 14 ఉదయం 9:51 గంటలకు ‘రావణాసుర’ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. ఈ ఓపెనింగ్ సెరమనీకి చిరు గెస్ట్‌గా విచ్చేస్తున్నారు.

Clap Board