Dasara : 110 కోట్ల దసరా.. డియర్ నాని అదిరిపోయింది అంటూ మెగాస్టార్ ట్వీట్!

నాని నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా దసరా (Dasara) 110 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా చూసిన చిరంజీవి..

Dasara : 110 కోట్ల దసరా.. డియర్ నాని అదిరిపోయింది అంటూ మెగాస్టార్ ట్వీట్!

Chiranjeevi tweet to Nani and Dasara team Dasara Collections

Dasara : నాని, కీర్తి సురేష్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ దసరా (Dasara). దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్రఖని, సాయి కుమార్, జాన్సీ ముఖ్య పాత్రల్లో నటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేశాడు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని 65 కోట్ల బడ్జెట్ తో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ నిర్మించింది. మార్చి 30న రెలీజి అయిన ఈ సినిమా మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది.

Dasara : ‘దసరా’లోని డిలీట్ సీన్ చూశారా.. సూపర్ ఉంది!

10 రోజుల్లో ఈ సినిమా 110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని సంచలనం సృష్టించింది. అంతేకాదు బ్రేక్ ఈవెన్ కూడా సాధించేసింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ లాభాలు లెక్కపెట్టుకొనే పనిలో పడ్డారు. ఈ మూవీ అమెరికన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ కలెక్షన్స్ అందుకుంటుంది. 2M కలెక్షన్స్ అందుకొని నాని కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలువడమే కాకుండా ఓవర్ సీస్ టాప్ ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి చూశాడు. దీంతో చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. డియర్ నాని దసరా సినిమా చూశాను. అద్భుతమైన చిత్రం. నీ పర్ఫార్మెన్స్ అండ్ మాక్ ఓవర్ తో చంపేశావ్. ఇక దర్శకుడు శ్రీకాంత ఓదెల మొదటి సినిమా అయిన సూపర్ గా తీశాడు. ఇక మన మహానటి తన నటనతో మరోసారి వావ్ అనిపించింది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన దీక్షిత్ శెట్టి, సంతోష్ నారాయణ్ సంగీతం.. ఇలా ప్రతి ఒక్కరి పని తీరు బాగుంది. కంగ్రాట్యులేషన్స్ నాని అండ్ ఎంటైర్ టీం అంటూ ట్వీట్ చేశాడు. చిరు ట్వీట్ కి నాని కూడా బదులిచ్చాడు. మీరో రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మెగాస్టార్ అంటూ ట్వీట్ చేశాడు.