Chiranjeevi : మెగా లైనప్.. ఏకంగా ఏడు సినిమాలు! | Chiranjeevi

Chiranjeevi : మెగా లైనప్.. ఏకంగా ఏడు సినిమాలు!

‘ఆచార్య’ ను ఏప్రిల్ 1న విడుదలకు సిద్ధం చేస్తున్న మెగాస్టార్.. తర్వాత వరుసగా కుర్ర దర్శకులతో క్రేజీ సినిమాలు లైనప్ చేశారు..

Chiranjeevi : మెగా లైనప్.. ఏకంగా ఏడు సినిమాలు!

Chiranjeevi : జస్ట్ టైం గ్యాప్ అంతే.. అన్నట్లుంది మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ చూస్తే.. ‘ఖైదీ నం:150’ తో రీ ఎంట్రీ ఇచ్చి తనకు తానే సాటి అనిపించుకున్న చిరు తర్వాత ‘సైరా’ వంటి హిస్టారికల్ ప్రాజెక్ట్‌తో తన డ్రీమ్ నెరవేర్చుకున్నారు.

Nagarjuna : చిరంజీవి కలవడంతో సమస్యకు హ్యాపీ ఎండింగ్

‘ఆచార్య’ ను ఏప్రిల్ 1న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తర్వాత వరుసగా కుర్ర దర్శకులతో క్రేజీ సినిమాలు లైనప్ చేశారు. బాస్ స్పీడ్ చూసి ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు సీనియర్ అండ్ యంగ్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. 60 ప్లస్ లోనూ యువకుడిలా ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు చిరు.

Chiranjeevi : కృష్ణా జిల్లా డోకిపర్రులో చిరంజీవి.. భార్యతో కలిసి గోదాదేవి కళ్యాణం..

‘ఆచార్య’ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ సినిమాలు పట్టాలెక్కించేశారు. ఈ రెండు సినిమాల మధ్యలో బాబీ సినిమా ఉంటుంది. తర్వాత యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో సినిమా కన్ఫమ్ చేసేశారు. ఆ తర్వాత మారుతితో ఓ సినిమా, అనిల్ రావిపూడితో మరో సినిమా ఫిక్స్ చేసేశారు చిరు. ‘ఆచార్య’ తో కలిపి ఏకంగా ఏడు సినిమాలు లైనప్ చేశారు మెగాస్టార్.

Pushpa : ప్రతీ సీన్ చక్కగా చెక్కావయ్యా సుకుమార్.. చిరు అభినందనలు..

×