Chiranjeevi: సినీ అవార్డులపై ప్రభుత్వాలు పునరాలోచించాలి: చిరంజీవి

తెలుగు రాష్ట్రాలు విడిపోయాక నటీనటులు అవార్డులు విషయంలో నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని కోరారు.

Chiranjeevi: సినీ అవార్డులపై ప్రభుత్వాలు పునరాలోచించాలి: చిరంజీవి

Chiranjeevi

Chiranjeevi: తెలుగు రాష్ట్రాలు విడిపోయాక నటీనటులు అవార్డులు విషయంలో నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని కోరారు. గురువారం జరిగిన తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి తలసానితో కలిసి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులకు హెల్త్ కార్డులను అందజేశారు. తన నట జీవితంలో సినిమా జర్నలిస్టుల పాత్రను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. నవంబర్‌లో నిర్వహించబోయే సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులకు తనవంతు సహకారాన్ని అందించనున్నట్లు భరోసా ఇచ్చారు. సినీ అవార్డుల విషయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని కోరారు.

Chiranjeevi: టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ ఎవరు.. మెగాస్టార్ ఏం చెప్పారంటే..

మంత్రి తలసాని మాట్లాడుతూ.. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టులు ఉన్నారు. తెలుగు సినిమాకు ప్రపంచ గుర్తింపు దక్కడంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా నిలిచింది’’ అన్నారు. అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం తనవంతుగా రూ.5 లక్షలు అందించనున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి యువ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా హాజరయ్యారు. తెలుగు ఫిలిం జర్నలిస్టులకు ఎల్లప్పుడూ తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.