Pelli Sandadi : శ్రీకాంత్ తనయుడి కోసం చిరంజీవి, వెంకటేష్

ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా ఈ 'పెళ్లి సందD' రాబోతుంది. ఈ 'పెళ్లి సందD' లో

Pelli Sandadi : శ్రీకాంత్ తనయుడి కోసం చిరంజీవి, వెంకటేష్

Pelli Sandadi (1)

Pelli Sandadi : దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఎంతో మంది హీరోలని, హీరోయిన్స్ ని సినీ పరిశ్రమకి పరిచయం చేశారు. 100కి పైగా చిత్రాలు తీశారు. ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు. ఇప్పుడు దర్శకుడిగా గ్యాప్ ఇచ్చి నటుడిగా పరిచయం అవ్వబోతున్నారు. ఆయన అందించిన గొప్ప చిత్రాల్లో ‘పెళ్లి సందడి’ ఒకటి. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ చిన్న సినిమా అప్పట్లో భారీ విజయం సాధించి ఎన్నో అవార్డులను, రివార్డులను, కలెక్షన్స్ ని సాధించింది. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడితో ఈ తరానికి తగ్గట్టు మరో ‘పెళ్లి సందD’ ని తయారు చేశారు. ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా ఈ ‘పెళ్లి సందD’ రాబోతుంది. ఈ ‘పెళ్లి సందD’ లో రాఘవేంద్రరావు గారు మొదటి సారి నటిస్తున్నారు.

MAA Elections : ‘మా’ ఎలక్షన్స్ రేపే.. గెలుపెవరిది??

అక్టోబ‌ర్ 15న దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు మొదలు పెట్టేసారు. రాఘవేంద్రరావు మొదటిసారి నటిస్తుండటంతో ప్రమోషన్స్ లో ఆయన కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలని స్టార్ హీరోలతో విడుదల చేయించారు. తాజాగా రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌ లు చీఫ్ గెస్ట్‌లుగా రాబోతున్నారు. చిరంజీవి, వెంకటేష్ లతో రాఘవేంద్రరావు ఎన్నో హిట్ సినిమాలని తీశారు. ఆ స్నేహంతో పిలవగానే వచ్చేందుకు ఒప్పుకున్నారు ఈ స్టార్ హీరోలు. మొత్తానికి ఈ ‘పెళ్లి సందD’ ని కూడా గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు.