Chiranjeevi : 27 అమెరికా నగరాల్లోని ఫ్యాన్స్ తో బాస్ పార్టీ.. వేరే లెవెల్..

అమెరికాలోని డల్లాస్, బోట్సన్, డెట్రాయిట్, అట్లాంటా, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో.. లాంటి ముఖ్యమైన 27 నగరాలలోని అభిమానులతో చిరంజీవి ఒకేసారి జూమ్ కాల్ లో ముచ్చటించారు. దీంతో అక్కడి చిరు ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. లైవ్ లో చిరంజీవి...............

Chiranjeevi : 27 అమెరికా నగరాల్లోని ఫ్యాన్స్ తో బాస్ పార్టీ.. వేరే లెవెల్..

Chiranjeevi Video Call with USA Fans for Waltair Veerayya Success

Chiranjeevi :  చిరంజీవి హీరోగా రవితేజ ముఖ్య పాత్రలో దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా ఇటీవల సంక్రాతికి రిలీజయి భారీ విజయం సాధించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా పది రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఇంకా థియేటర్స్ లో దూసుకుపోతుంది. మన తెలుగు స్టేట్స్ లోనే కాక విదేశాల్లో కూడా వాల్తేరు వీరయ్య సినిమాకి భారీ ఆదరణ లభిస్తుంది.

వాల్తేరు వీరయ్య సినిమా అమెరికాలో ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అమెరికాలో 3 మిలియన్ డాలర్స్ వైపు దూసుకెళ్తుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ విజయం పై చిరంజీవి, రవితేజ, చిత్రయూనిట్ తో పాటు అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా అమెరికాలో కూడా భారీ విజయం సాధించడంతో తాజాగా మెగాస్టార్ చిరంజీవి అమెరికాలో ఉన్న అభిమానులతో USA ఫ్యాన్స్ పార్టీ అంటూ వీడియో కాల్ లో ముచ్చటించారు.

Raviteja-Siddhu : రవితేజ-సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్ లో సినిమా??

అమెరికాలోని డల్లాస్, బోట్సన్, డెట్రాయిట్, అట్లాంటా, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో.. లాంటి ముఖ్యమైన 27 నగరాలలోని అభిమానులతో చిరంజీవి ఒకేసారి జూమ్ కాల్ లో ముచ్చటించారు. దీంతో అక్కడి చిరు ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. లైవ్ లో చిరంజీవి అంతమందితో మాట్లాడటం, చిరు ఫుల్ ఎనర్జీతో అభిమానులతో సరదాగా మాట్లాడటం, పాటలు పాడటంతో అభిమానులు కూడా అంతే ఎనర్జీ చూపించారు. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోని చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. చాలా ఆనందంగా ఉంది. అమెరికాలోని 27 నగరాల నుంచి నా అభిమానులతో మాట్లాడినందుకు. మీరు చూపించే ప్రేమకి కృతజ్ఞుడిని. లవ్ యు ఆల్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో కాల్ పై NRI లు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.