Chiranjeevi : రవితేజ ముంబై హీరో.. తెలుగు వాడిని అనిపించుకోడానికి లోకల్ అంటాడు.. చిరంజీవి!

మెగాస్టార్ నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఏ మూవీలో రవితేజ ఒక ముఖ్యపాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఫంక్షన్ లో చిరంజీవి, రవితేజ తెలుగు వాడు కాదు ముంబై హీరో అంటూ వైరల్ కామెంట్స్ చేశాడు.

Chiranjeevi : రవితేజ ముంబై హీరో.. తెలుగు వాడిని అనిపించుకోడానికి లోకల్ అంటాడు.. చిరంజీవి!

Chiranjeevi viral comments on raviteja

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న మాస్ మసాలా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరు అండ్ రవితేజ ఇద్దరు హాజరయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఈ ఈవెంట్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఇక ఈ ఫంక్షన్ లో చిరంజీవి, రవితేజ తెలుగు వాడు కాదు ముంబై హీరో అంటూ వైరల్ కామెంట్స్ చేశాడు.

Chiranjeevi : రవితేజతో సినిమా చేయాలి అంటే కోపం వచ్చేస్తుంది.. చిరంజీవి!

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. “నా బ్రదర్ రవితేజ. హిందీ గ్యాంగ్ లీడర్ లో నాతో పాటు ఒక చిన్న స్నేహితుడు పాత్రలో నటించాడు. అంతా హిందీలో మాట్లాడే వాడు. ఇంతకు ముందు రవి మాట్లాడుతూ విజయవాడ కుర్రాడిని అని చెప్పాడు. కానీ అతను పుట్టి పెరిగింది అంతా ముంబైలో. తెలుగు వాడిని అనిపించుకోడానికి లోకల్ అంటుంటాడు నమ్మకండి” అంటూ సరదాగా మాట్లాడాడు.

“నార్త్ లో అమితాబ్ బచ్చన్, సౌత్ లో నన్ను చూసి హీరోగా మారాను అంటూ రవితేజ చాలాసార్లు చెప్పాడు. చిన్న చిన్న క్యారెక్టర్ లు వేసుకుంటూ ఇప్పుడు మాస్ మహారాజ్ అనిపించుకుంటుంటే నాకు చాలా గర్వంగా ఉంది. తనకంటూ ఒక సొంత గుర్తింపుని సంపాదించుకున్నాడు. నాకు సమయం దొరికినప్పుడు రవితేజ మూవీస్ చూస్తుంటా. అతని సినిమాల్లో మాస్, ఎమోషన్స్, డాన్స్, అల్లరి అలాగే కొంచెం ఎటకారం కూడా ఉంటుంది” అంటూ చిరంజీవి వ్యాఖ్యానించగా.. అవి అన్ని మీ నుంచి మేము నేర్చుకున్నది అంటూ రవితేజ చెప్పుకొచ్చాడు.

దానికి చిరంజీవి.. నేను చేసేది కామెడీ. నువ్వు చేసేది వెటకారంగా ఉంటుంది అంటూ బదులిచ్చాడు. ఇక ఈ సినిమాలో వీరిద్దరి పాత్రలో ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయి. రవితేజ వచ్చిన దగ్గర నుంచి ఈ మూవీ మరో స్థాయికి వెళ్ళిపోతుంది అంటూ తెలియజేశాడు.