Chiranjeevi : విశాఖలో ఇల్లు కడుతున్నా.. ఇక్కడే సెటిల్ అవుతా అంటున్న మెగాస్టార్.. ఏపీలో చర్చగా మారిన వ్యాఖ్యలు..

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. నా సినిమాల్లో వైజాగ్ కథతో ఉన్న చాలా సినిమాలు హిట్ అయ్యాయి. నాకు కూడా వైజాగ్ అంటే చాలా ఇష్టం. ఇది ఒక స్వర్గధామంలా ఉంటుంది. రిటైర్ అయ్యాక ఇక్కడ హ్యాపీగా సెటిల్ అవ్వొచ్చు. ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు మీ అందరికి చెప్తున్నాను..........

Chiranjeevi : విశాఖలో ఇల్లు కడుతున్నా.. ఇక్కడే సెటిల్ అవుతా అంటున్న మెగాస్టార్.. ఏపీలో చర్చగా మారిన వ్యాఖ్యలు..

Chiranjeevi wants to settle in Visakhapatnam in future

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా, రవితేజ ముఖ్యపాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్స్ తో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. తాజాగా ఆదివారం రాత్రి వైజాగ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. నా సినిమాల్లో వైజాగ్ కథతో ఉన్న చాలా సినిమాలు హిట్ అయ్యాయి. నాకు కూడా వైజాగ్ అంటే చాలా ఇష్టం. ఇది ఒక స్వర్గధామంలా ఉంటుంది. రిటైర్ అయ్యాక ఇక్కడ హ్యాపీగా సెటిల్ అవ్వొచ్చు. ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు మీ అందరికి చెప్తున్నాను. నేను వైజాగ్ లో స్థలం కొన్నాను. త్వరలోనే ఇల్లు కూడా కట్టబోతున్నాను. భవిష్యత్తులో ఇక్కడే సెటిల్ అవుతాను. ఇక్కడే విశాఖలోనే ఉంటాను. ఇక్కడి ప్రజలు చాలా మంచివాళ్ళు. అందరికి సపోర్ట్ చేస్తారు. ఇక్కడి సముద్రం, ప్రదేశాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్తయి. భవిష్యత్తులో విశాఖలోనే సెటిల్ అవ్వబోతున్నాను అని అన్నారు.

Dil Raju : తెలుగులో వారసుడు వాయిదా.. నా మీద పడి అందరూ ఏడుస్తున్నారు.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..

దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మాములుగా అయితే ఈ వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోరు కానీ ఇప్పుడు ఏపీలో మూడు రాజధానుల అంశం ఉండటం, విశాఖని కూడా ఒక రాజధాని చేస్తాం అని చెప్పడంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చగా మారాయి. విశాఖ మంచి గ్రేటర్ సిటీ. చాలా మంది అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారు. ఇక విశాఖని రాజధాని చేస్తాం అని చెప్పిన తర్వాత విశాఖకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో చిరంజీవి వైజాగ్ లో ఇల్లు కడుతున్నాను, ఇక్కడే సెటిల్ అవుతున్నాను అనడంతో వైసీపీ నాయకులు ఈ వ్యాఖ్యలని తమకు అనుకూలంగా మార్చుకొని జనసేనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. విశాఖ రాజధాని అవుతుంది కాబట్టే ఇక్కడ కొన్నారు అని వైసీపీ నాయకులు అంటున్నారు. మొత్తానికి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మాత్రం మరోసారి జనసేన వర్సెస్ వైసీపీ గా మారుతున్నాయి.