Chiranjeevi : ఇండస్ట్రీలో ఎవరు పడితే వాళ్ళు ఇష్టమొచ్చిన స్టేట్మెంట్స్ ఇవ్వకండి..

ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై మాట్లాడిన వారందర్ని ఉద్దేశిస్తూ.. ''నేను ఇండస్ట్రీ పెద్దగా జగన్ ని కలవలేదు. ఇండస్ట్రీ బిడ్డగా వచ్చాను. మీ అందరికి ఇండస్ట్రీ బిడ్డగా ఒకటే చెప్తున్నాను......

Chiranjeevi : ఇండస్ట్రీలో ఎవరు పడితే వాళ్ళు ఇష్టమొచ్చిన స్టేట్మెంట్స్ ఇవ్వకండి..

Chiranjeevi 2

Chiranjeevi :   ఏపీలో సినిమా టికెట్‌ ధరల సమస్య రోజు రోజుకి జఠిలమవుతున్న సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మెగాస్టార్ చిరంజీవి ని ఫోన్ చేసి లంచ్ కి ఆహ్వానించారు. లంచ్ తర్వాత ఇండస్ట్రీ సమస్యల్ని, థియేటర్ సమస్యల్ని, టికెట్ రేట్లపై ఇండస్ట్రీ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇవన్నీ వివరంగా జగన్ కి చెప్పారు చిరంజీవి. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ… ”జగన్ గారు నేను చెప్పిన సినీ పరిశ్రమలోని సమస్యల్ని విన్నారు. త్వరలో వాటిపై అందరికి ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం తీసుకుంటాను అని అన్నారని, అలాగే ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ వచ్చి చెప్పమన్నారు. ఈ నెలాఖరు లోపు ఈ సమస్యకి పరిష్కారం వస్తుంది” అని చిరంజీవి మీడియాకి తెలిపారు.

అయితే సినిమా టికెట్ల రేట్లని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి సినీ పరిశ్రమ వ్యక్తులు చాలా మంది వ్యతిరేకిస్తూ మాట్లాడారు. కొంతమంది మాత్రం సపోర్ట్ చేశారు. థియేటర్ యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. చాలా మంది ఈ వ్యతిరేకతని బాహాటంగానే తెలిపారు. ఇటీవలే ఆర్జీవీ కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ జగన్ ని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన చిరంజీవి ఈ విషయంపై గట్టిగానే స్పందించారు.

AP Cinema Ticket Price Issue : జగన్ చాలా పెద్ద మాట అన్నారు : చిరంజీవి

ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై మాట్లాడిన వారందర్ని ఉద్దేశిస్తూ.. ”నేను ఇండస్ట్రీ పెద్దగా జగన్ ని కలవలేదు. ఇండస్ట్రీ బిడ్డగా వచ్చాను. మీ అందరికి ఇండస్ట్రీ బిడ్డగా ఒకటే చెప్తున్నాను. ఎవరూ తొందరపడి అభద్రతా భావంతో మాటలు జారొద్దు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొద్దు, ఇష్టమొచ్చిన స్టేట్మెంట్స్ ఇవ్వకండి. కొన్ని రోజులు సంయమనం పాటించండి. జగన్ గారు మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ నెల లోపు పరిష్కరం చేస్తారు. నేను అందరి తరపున మన సమస్యల్ని వివరించాను. ఈ మీటింగ్ లో ఏం జరిగింది, జగన్ గారు నాకు చెప్పినవన్నీ ఇండస్ట్రీ పెద్దలతో త్వరలో సమావేశం పెట్టి అందరికీ చెప్తాను. మీరు ఏమైనా సమస్యల్ని చెప్తే మళ్ళీ అవన్నీ విని మళ్ళీ జగన్ ని కలుస్తాను. త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది” అని అన్నారు. మరి దీనిపై ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.