Godfather: చిరు.. సల్మాన్.. ప్రభుదేవా.. థమన్.. వాట్ ఏ కాంబినేషన్!

మెగాస్టార్ చిరంజీవి స్టెప్ ఏస్తే గ్రేస్, డాన్స్ చేస్తే స్టైల్. ఇటు మాసూ, క్లాసూ ఆడియన్స్ ఎవరైనా ఫిదా కావాల్సిందే. అటు సల్మాన్ ఖాన్ కొంటెతనంతో, చిలిపి తనంతో కామిక్ స్టెప్స్ లతో డాన్స్ చేస్తే, బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే..

Godfather: చిరు.. సల్మాన్.. ప్రభుదేవా.. థమన్.. వాట్ ఏ కాంబినేషన్!

Godfather

Godfather: మెగాస్టార్ చిరంజీవి స్టెప్ ఏస్తే గ్రేస్, డాన్స్ చేస్తే స్టైల్. ఇటు మాసూ, క్లాసూ ఆడియన్స్ ఎవరైనా ఫిదా కావాల్సిందే. అటు సల్మాన్ ఖాన్ కొంటెతనంతో, చిలిపి తనంతో కామిక్ స్టెప్స్ లతో డాన్స్ చేస్తే, బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే.. ఈ ఇద్దరూ కలిసి ఒక స్పెషల్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది. ఈ ఇద్దరి ఫేవరేట్ ఇండియన్ మైకెల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రాఫీ చేస్తే ఇంకెలా ఉంటుంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో ఓ స్పెషల్ సాంగ్ రాబోతుంది. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.

Godfather: చిరుతో పూరి ఆన్ స్క్రీన్.. గాడ్ ఫాదర్‌లో ఫుల్ లోడ్ స్టార్ క్యాస్ట్!

గాడ్ ఫాదర్ విషయంలో మెగాస్టార్.. స్టార్ కాస్ట్ విషయంలో ఎంత కేర్ తీసుకున్నారో.. సాంగ్స్ విషయంలోనూ అంతే కేర్ తీసుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ తో స్పెషల్ రోల్ చేయించడమే కాదు కలసి స్టెప్పులేసేందుకు డాన్స్ డైరెక్టర్ గా ప్రభుదేవాను చూజ్ చేసుకున్నారు. తగ్గేదేలే అంటూ మాస్ స్టెప్పులేసి, టాలీవుడ్, బాలీవుడ్ ను షేక్ చేసేందుకు రెడీ అయ్యారు చిరంజీవి, సల్మాన్ ఖాన్.

Godfather: చిరుతో సల్మాన్.. ముంబైలో మొదలు కానున్న యాక్షన్!

లంకేశ్వరుడు సినిమాలోని 16 ఏళ్ల వయసూ.. అనే సాంగ్ తో ప్రభుదేవా, చిరంజీవి కాంబినేషన్ సెట్ అయ్యింది. ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ అన్నీ ఆల్మోస్ట్ సూపర్ డూపర్ హిట్సే. రాజవిక్రమార్క, కొదమ సింహం, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి సినిమాల్లో చిరూ డాన్స్ స్టెప్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక ఘరానా మొగుడు సినిమాలో బంగారు కోడిపెట్ట.. ముఠామేస్త్రీ టైటిల్ సాంగ్.. ఇప్పటికీ ఆడియన్స్ ను ఓ ఊపు ఊపేస్తున్నాయి.

Megastar’s GodFather: టైటిల్ పోస్టర్.. గాడ్ ఫాదర్‌గా మెగాస్టార్ చిరంజీవి!

డాన్స్ డైరెక్టర్ గా ప్రభుదేవాకు చాలా సాంగ్స్ ఇచ్చి ప్రోత్సహించిన చిరంజీవి, శంకర్ దాదా జిందాబాద్ సినిమాతో డైరెక్టర్ గానూ ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. సౌత్ లోనే కాదు, నార్త్ లోనూ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో వాంటెడ్, రెడీ, దబాంగ్ 3, రాధే సినిమాలు చేశారు. సల్మాన్ ఖాన్ సాంగ్స్ కి తనదైన స్టైల్ లో కొరియోగ్రఫీ చేసి, కండల వీరుడితోనూ సరికొత్త స్టెప్పులేయించి బాలీవుడ్ ఆడియన్స్ నూ మెస్మరైజ్ చేశారు ప్రభుదేవా.

Chiranjeevi: రౌడీ హీరోకు చెక్ పెట్టిన మెగాస్టార్..?

ఇటు చిరంజీవితో బ్రేక్ డాన్స్ చేయించి.. అటు సల్మాన్ తో మాస్ మూమెంట్స్ చూపించిన ప్రభుదేవా.. ఈసారి ఇద్దరిని కలిపి కొరియోగ్రఫీ చేస్తుండటంతో ఫ్యాన్స్ లో ఎక్జైట్ మెంట్ పెరిగింది. శంకర్ దాదా జిందాబాద్ తర్వాత చిరూతో రాధే తర్వాత సల్మాన్ తో ప్రభుదేవా కాంబినేషన్ సెట్ అయ్యింది. తమన్ మ్యూజిక్ కు ఈ అరుదైన క్రేజీ కాంబినేషన్ చేసే మ్యాజిక్… గాడ్ ఫాదర్ కు బూస్టప్ నివ్వడం ఖాయం.