Telugu Films : ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే..?
కరోనా మహమ్మారి తర్వాత సినిమాల విడుదలకు ఇంకా పూర్తిగా పరిస్థితులు అనుకూలించలేదు కానీ.. పెండింగ్ లో ఉన్న సినిమాలు, కొత్త సినిమాల షూటింగ్ మాత్రం జోరుగా జరుగుతుంది.

Telugu Films Shooting Update: కరోనా మహమ్మారి తర్వాత సినిమాల విడుదలకు ఇంకా పూర్తిగా పరిస్థితులు అనుకూలించలేదు కానీ.. పెండింగ్ లో ఉన్న సినిమాలు, కొత్త సినిమాల షూటింగ్ మాత్రం జోరుగా జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి మొదలు యంగ్ హీరో నాగ శౌర్య వరకు షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు. చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్న లుసిఫర్ రీమేక్ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుండగా.. రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబయ్ లో జరుగుతుంది.
ఇక టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టులలో ఒకటైన మహేష్ బాబు, పరశురామ్ డైరెక్షన్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతుండగా.. రవితేజ నటిస్తున్న రామారావు అన్ డ్యూటీ చిత్రం షూటింగ్ ఫిలిం సిటీలో జరుగుతోంది. నాగార్జున కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నటిస్తున్న బంగార్రాజు చిత్రం షూటింగ్ కూడా ఫిలిం సిటీలోనే వేసిన సెట్స్ లో జరుగుతుండగా.. నాని నటిస్తున్న అంటే సుందరానికి మూవీ హైదరాబాద్ లో జరుగుతుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా ఘని ఢిల్లీలో షూటింగ్ లో జరుగుతుంటే.. నాగశౌర్య అనీష్ కృష్ణ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా హైదరాబాద్ లో జరుగుతుంది. గోపిచంద్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పక్క కమర్షియల్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రాక్ క్యాజిల్ లో జరుగుతుంది. ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఫిలిం సిటీలోనే షూటింగ్ జరుపుకుంటున్నాయి.